TOP9 ET: సమంతతో నాని ప్రైవేట్‌ వీడియో.! | రచ్చ లేపుతున్న అల్లు అర్జున్ కామెంట్స్.

|

Aug 23, 2024 | 8:22 AM

ఎట్ ప్రజెంట్ తన అప్‌కమింగ్ ఫిల్మ్ సరిపోదా శనివారం సినిమాతో బిజీగా ఉన్న నేచురల్ స్టార్ నాని.. అనుకోకుండా ఎయిర్‌ పోర్ట్‌లో సమంతను కలిశారు. ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ ప్లైట్ ఎక్కారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో బయటికి వచ్చింది. ప్రైవేట్ వీడియో .. కోఇన్సిడెన్స్ హ్యాష్ ట్యాగ్‌తో నెట్టింట వైరల్ అవుతోంది. | ఇష్టమైన వారిపై ప్రేమ చూపించాలని.. తనకు ఇష్టమైతే.. తన మనసుకు నచ్చితేనే వస్తా అని.. రీసెంట్‌గా అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట రచ్చ లేపుతున్నాయి.

01.allu arjun: రచ్చ లేపుతున్న అల్లు అర్జున్ కామెంట్స్

ఇష్టమైన వారిపై ప్రేమ చూపించాలని.. తనకు ఇష్టమైతే.. తన మనసుకు నచ్చితేనే వస్తా అని.. రీసెంట్‌గా అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట రచ్చ లేపుతున్నాయి. మారుతీ నగర్‌ సుబ్రమణ్యం ఈవెంట్లో బన్నీ నోటి నుంచి వచ్చిన ఈ మాటలే.. అక్రాస్ సోషల్ మీడియాలో సెన్సేషనల్ అవుతున్నాయి. ఏపీ ఎలక్షన్స్‌ టైంలో నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవి కోసం బన్నీ ప్రచారం చేశారు. అలా ప్రచారం చేసింది మొదలు.. అల్లు అర్జున్‌ పై ఓ వర్గం నెటిజన్స్‌ సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. ట్రోల్స్‌ చేస్తున్నారు. ఆయన తీరును విమర్శిస్తున్నారు. ఇక ఇవి చూసి.. చూసి.. అల్లు అర్జున్ ఒక్కసారిగా ఈరేంజ్లో రియాక్టయ్యారని అంటున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్‌.

02. nani: సమంతతో నాని ప్రైవేట్‌ వీడియో..

ఎట్ ప్రజెంట్ తన అప్‌కమింగ్ ఫిల్మ్ సరిపోదా శనివారం సినిమాతో బిజీగా ఉన్న నేచురల్ స్టార్ నాని.. అనుకోకుండా ఎయిర్‌ పోర్ట్‌లో సమంతను కలిశారు. ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ ప్లైట్ ఎక్కారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో బయటికి వచ్చింది. ప్రైవేట్ వీడియో .. కోఇన్సిడెన్స్ హ్యాష్ ట్యాగ్‌తో నెట్టింట వైరల్ అవుతోంది.

03. chiranjeevi: కొంచెం బాధ.. కొంచెం ఆనందం

కొంచెం బాధ.. కొంచెం ఆనందం అన్నట్టుగా ఉంది ఇప్పుడు మెగా ఫ్యాన్స్ పరిస్థితి. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు చిరు బర్త్‌ డే కానుకగా.. చిరు మోస్ట్ అవేటెడ్ మూవీ విశ్వంభర నుంచి టీజర్‌ వస్తుందని మెగా ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేశారు. ఈగర్‌గా వెయిట్ చేస్తూ వస్తున్నారు. కానీ వీరి ఎక్స్‌పెక్ట్‌ చేసినట్టుగా కాకుండా.. విశ్వంభర నుంచి టీజర్‌ రాట్లేదనే మేకర్స్ చేసిన అనౌన్స్‌మెంట్‌తో చిన్నబుచ్చుకున్నారు. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన చిరు పవర్ ఫుల్ లుక్‌ పోస్టర్‌తోనే సరిసెట్టుకుని ఆనందపడుతున్నారు. ఆ పోస్టర్‌నే నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు.

04.allu arjun: మెగాస్టార్‌కు బన్నీ బర్త్‌ డే విషెస్‌

మెగా స్టార్ చిరుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్‌ డే విషెస్ చెప్పారు. స్వీట్ గా సింపుల్‌గా… మెనీ మోర్ రిటర్న్స్‌ ఆఫ్‌ ది డే టూ అవర్‌ మెగాస్టార్ చిరు గారు అంటూ.. తన ట్వీట్లో రాసుకొచ్చారు. ఇక అల్లు అర్జున్ మాత్రమే కాదు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ .. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా మెగా స్టార్ చిరుకు స్వీట్‌గా విషెస్ చెప్పారు.

05.indra : ఇంద్ర రీ-రిలీజ్‌ రికార్డ్‌

అప్పట్లో రిలీజైనప్పుడే కాదు.. ఇప్పుడు రీ- రిలీజ్‌లోనూ నయా రికార్డ్‌ క్రియేట్ చేసింది మెగా స్టార్ చిరు ఇంద్ర మూవీ. రీ- రిలీజ్‌ సినిమాలన్నింటిలో.. క్రేజీయెస్ట్ సినిమాగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న చిరు ఇంద్ర మూవీ.. ఏకంగా 385 కు పైగా థియేటర్లలో.. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఏరియాల్లో రిలీజ్ అయింది. అయితే ఓ రిలీజ్‌ అయిన సినిమా.. ఈ రేంజ్‌ థియేటర్స్‌లో రీ రిలీజ్ అవ్వడం ఇప్పుడో రికార్డ్‌ గా హిస్టరీ కెక్కింది. బిగ్గెస్ట్ ఎవర్‌ రీ రిలీజ్గా నెట్టింట వైరల్ అవుతోంది.

06.vijay: చిరు పార్టీకి, విజయ్‌ పార్టీకి మధ్య సంబంధం ఏంటి?

చిరు పార్టీకి, విజయ్ పార్టీకి మధ్య సంబంధం ఏంటి? నిజం చెప్పాలంటే ఏమీ లేదు. కానీ కొంత మంది నెటిజన్లు మాత్రం.. ఈ రెండు పార్టీల మధ్య.. ఈ ఇద్దరు స్టార్ల మధ్య ఉన్న పోలికలను.. సంబంధాలను పనిగట్టుకుని మరీ నెట్టింట ప్రచారం చేస్తున్నారు. అప్పట్లో చిరు పార్టీ పెట్టిన సందర్భాన్ని.. ఆయన పెట్టిన పార్టీపై జనాల్లో ఉన్న క్రేజ్‌ను.. ఇప్పుడు విజయ్ పార్టీ పెట్టే సందర్భంతో.. క్రేజ్‌తో పోలుస్తున్నారు. దాంతో పాటే చిరులాగే.. విజయ్‌ దళపతి కూడా.. రెండు చేతులూ పెకెత్తి బొటన వేలిని చూపించడాన్ని కూడా.. పోలుస్తున్నారు. చిరు పీఆర్పీ పార్టీకి – విజయ్ తమిళగ వెట్రి కళగం పార్టీకి నేరుగా సంబంధం లేకపోయినా.. ఈ ఇద్దరు స్టార్ల వ్యక్తిత్వాలను.. నేచర్‌ను.. క్రేజ్‌ను పోలుస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు.

07.allu arjun: బన్నీ గడ్డానికి అర కోటి.?

టైమిస్తే పెరిగే గడ్డానికి.. టైం లేక… ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరకోటి ఖర్చు పెట్టాడట. ఎస్ ! ఇదే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇక అసలు విషయం ఏంటంటే.. ! అనుకున్న దాని కంటే పుష్ప2 సినిమా డిలే కావడం.. ఒకే రేంజ్లో గుబురు గడ్డాన్ని మెయిన్‌ టేన్ చేయాల్ని రావడం.. అది కాస్తా కష్టంగా మారడంతో.. బన్నీ ఆర్టిఫిషియల్‌గా గడ్డాన్ని పెట్టించుకుంటున్నారట. అందుకోసం ముంబయ్‌ నుంచి స్పెషల్ పర్సన్ ను రిక్రూట్ చేసుకున్నారట. అయితే ఇలా గడ్డం పెట్టించుకోడానికి.. సెట్‌ చేయడానికి దాదాపు అరకోటి వరకు ఖర్చు పెడుతున్నారట ఈ స్టార్. అయితే ఈ ఫెసిలిటీ వల్లే.. పుష్ప2 షూటింగ్లో గుబురు గడ్డంతో.. షూటింగ్ లేని టైంలో చిన్న గడ్డంతో బన్నీ కనిపిస్తున్నారు. గడ్డం లొల్లి లేకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు.

08.fan: నీ అభిమానం సల్లగుండా.. పొర్లు దండాలు పెడుతూ తిరుమల మెట్లెక్కిన ఫ్యాన్.

ఒక్కోసారి హీరోలపై కొందరు చూపించే అభిమానం అందర్నీ షాకయ్యేలా చేస్తుంది. ఇక మెగాస్టార్ చిరు పై ఈశ్వర్ రాయల్‌ అనే వీరాభిమాని చూపించిన అభిమానం కూడా అదే చేస్తోంది. తిరుపతి జిల్లా.. రామచంద్రపురం.. బలిజేపల్లి గ్రామానికి చెందిన ఈశ్వర్ రాయల్ చిరు వీరాభిమాని. దీంతో తన అభిమాన హీరో నిండు నూరేళ్లు క్షేమంగా ఉండాలని.. ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ.. శ్రీవారి మెట్టు మార్గంలో పొర్లు దండాలు పెట్టారు. చిరుపై తను చూపించిన ప్రేమ అభిమానంతో.. ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు ఈయన.

09.ayesha: గుర్తు పట్టలేనంతగా మారిపోయిన సూపర్ హీరోయిన్.!

ఆయేషా టాకియా..! సూపర్ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ఆడియెన్స్‌కు పరిచయం అయిన ఈ బ్యూటీ.. తన అందంతో అందర్నీ ఆకట్టుకున్నారు. అప్పట్లో అందరి హార్ట్స్‌లో తిష్టేశారు. అలాంటి ఈ బ్యూటీ ఇప్పుడు షాకింగ్‌ లుక్‌లో కనిపించారు. గుర్తు పట్టలేనంతగా మారిపోయారు. తన లేటెస్ట్ లుక్స్‌తో.. ఇప్పుడు తన ఫ్యాన్స్‌ ను షాకయ్యేలా చేస్తూనే.. నెట్టింట వైరల్ అవుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.