షూటింగ్‌లతో ఫుల్ బిజీ టాలీవుడ్.. స్టార్ హీరోలందరూ సెట్స్‌పైనే

Edited By:

Updated on: Jul 21, 2026 | 7:29 PM

టాలీవుడ్‌లో స్టార్ హీరోలంతా వరుస షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. నాని ‘ప్యారడైజ్’, ప్రభాస్ ‘ఫౌజీ’, ‘స్పిరిట్’, ఎన్టీఆర్ ‘డ్రాగన్’, అల్లు అర్జున్ ‘రాకా’, విజయ్ దేవరకొండ ‘రణబలి’ సహా పలు భారీ చిత్రాల చిత్రీకరణ హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో శరవేగంగా కొనసాగుతోంది. కొత్త ప్రాజెక్టులు పూర్తి చేయడమే లక్ష్యంగా హీరోలు విరామం లేకుండా షూటింగ్‌ల్లో పాల్గొంటున్నారు.

షూటింగ్ షూటింగ్ షూటింగ్.. మన హీరోలను ఎవరిని కదిపినా ఇప్పుడిదే అంటున్నారు. ఎవర్ని చూసినా లొకేషన్‌లోనే కనిపిస్తున్నారు. ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ పూర్తయ్యే వరకు నో బ్రేక్స్ అంటున్నారు. ఒకరిద్దరు మినహాయిస్తే మిగిలిన వాళ్లందరూ షూటింగ్స్‌తోనే బిజీ బిజీగా ఉన్నారు. సీనియర్ హీరోలు సైతం నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌పై ఫోకస్ పెంచేసారు. మరి ఎవరి షూటింగ్ ఎక్కడ జరుగుతుందో చూద్దామా..? ముందుగా హెలో నేటివ్ స్టూడియోలో జరుగుతున్న షూటింగ్స్‌ను చూద్దాం.. నాని, శ్రీకాంత్ ఓదెల చేస్తున్న ప్యారడైజ్‌తో పాటు.. ప్రశాంత్ వర్మ కథ అందిస్తున్న అధీరా, రవితేజ ఇరుముడి షూట్స్ ముచ్చింతల్‌లోనే జరుగుతున్నాయి. ప్రభాస్ ఫౌజీ షూట్ కోకాపేటలో జరుగుతుంది. స్పిరిట్ షూటింగ్ అజీజ్‌నగర్‌లో జరుగుతుంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమా షూట్ ఆర్ఎఫ్‌సీలోనే కంటిన్యూ అవుతోంది. అల్లు అర్జున్ రాకా షూటింగ్ కొన్ని నెలలుగా ముంబైలోనే జరుగుతుంది. వారణాసి షూట్ కూడా గత నెల రోజులుగా శంషాబాద్ తాహెర్ స్టూడియోలో జరుగుతుండగా.. వెంకటేష్, అనిల్ రావిపూడి, కళ్యాణ్ రామ్ షూట్ మోకిళ్లలో జరుగుతుంది. బాలకృష్ణ గోపిచంద్ మలినేని సినిమా షూటింగ్ కాకినాడలో జరుగుతోంది.
శ్రీ విష్ణు రామ్ అబ్బరాజు షూట్‌తో పాటు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న సంబరాల ఏటిగట్టు సినిమా షూటింగ్ కూడా శంకరపల్లిలోనే జరుగుతుంది. గోపీచంద్, వెంకట్ కాంబినేషన్‌లో వస్తున్న సింగ షూట్ అల్యూమీనియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. ఇక విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రణబాలి షూటింగ్ బేతంచర్ల నుంచి గండిపేటకు షిఫ్ట్ అయింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Anupama Parameswaran: ‘నా గొంతు నేనే వినిపిస్తా’.. అనుపమ ఎమోషనల్ పోస్ట్ వెనక అసలు కథ ఏంటి?

Mamitha Baiju: నెల రోజుల్లో మూడు భారీ సినిమాలు.. మమిత బైజు దండయాత్రకు రెడీ!

Ramayana Leak: ‘రామాయణ’ ట్రైలర్ లీక్ వెనక అసలు కథ ఏంటి..? పైరసీనా.. ప్రమోషన్ ప్లానా?

Bhagyasree Borse: ‘ఐరెన్ లెగ్’ అంటూ నన్నే ఎందుకు..? హిట్ తర్వాత భాగ్యశ్రీ బోర్సే ఘాటు కౌంటర్!

Salman Khan: కండల వీరుడికి ఏమైంది..? సల్మాన్ ఖాన్ కొత్త లుక్ చూసి షాక్‌లో అభిమానులు!

Published on: Jul 21, 2026 06:41 PM
Loading...
Unable to load recommendations.
Follow Us