గ్లామర్ షో చేస్తే ఇండస్ట్రీలో అవకాశాలు క్యూ కడతాయా..?

Edited By:

Updated on: May 21, 2026 | 5:30 PM

టాలీవుడ్‌లో హీరోయిన్ల గ్లామర్ ట్రెండ్ మరింత హాట్ టాపిక్‌గా మారుతోంది. జాన్వీ కపూర్, మమితా బైజు, భాగ్యశ్రీ బోర్సే, కయదూ లోహర్ వంటి భామలు గ్లామర్ డోస్ పెంచుతూ మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. నటన కంటే అందాల ఆరబోతకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే చర్చ ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది. ఈ ఫార్ములా వారికి ఎంతవరకు సక్సెస్ ఇస్తుందో చూడాలి.

కేవలం గ్లామర్ షో చేస్తేనే ఇండస్ట్రీలో అవకాశాలు క్యూ కడతాయా.. అందాలు ఆరబోస్తే ఆఫర్స్ ఇచ్చేస్తారా.. అందుకే ఇప్పుడు మన హీరోయిన్లంతా ఇదే ఫార్ములాను ఫాలో అవుతూ అందాల ఆరబోతకే ఓటేస్తున్నారా..? నటనను పక్కనపెట్టి గ్లామర్ డోస్ పెంచితేనే స్టార్ డమ్ వస్తుందని వీళ్లంతా ఫిక్స్ అయ్యారా..? ఇందులో నిజం ఎంత..? టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా గ్లామర్ మంత్రమే వినిపిస్తోంది.. తాజాగా పెద్దిలో జాన్వి కపూర్ తన అందాల ఆరబోతతో స్పెషల్ అట్రాక్షన్ గా మారబోతున్నారనే టాక్ బాగానే వినిపిస్తోంది. ముందు దేవరలోనూ గ్లామర్ మంత్రమే వేశారు ఈమె. మరోవైపు క్యూట్ లుక్స్ తో ఆకట్టుకున్న మమితా బైజు సైతం విశ్వనాథ్ అండ్ సన్స్ లో ఫస్ట్ టైమ్ గ్లామర్ డోస్ భారీగానే పెంచేసారు. క్లాస్ లుక్స్ తో ఎంట్రీ ఇచ్చిన భామలు సైతం మాస్ ఆడియన్స్ కు దగ్గరయ్యేందుకు గ్లామర్ షోనే నమ్ముకుంటున్నారిప్పుడు. అఖిల్ హీరోగా నటిస్తున్న లెనిన్ లో భాగ్యశ్రీ బోర్సే బానే మాయ చేశారు. ఎట్టా ఎట్టా పాటలో భాగ్యశ్రీ లుక్స్ అదిరిపోయాయి. మిస్టర్ బచ్చన్ నుంచి ఇప్పటి వరకు గ్లామర్ బాటలోనే వెళ్తున్నారు భాగ్యశ్రీ. మధ్యలో కాంతాలో మాత్రమే పర్ఫార్మెన్స్ రోల్ చేశారు. ఇక కెరీర్ మొదటి నుంచి కూడా యాక్టింగ్ కంటే గ్లామర్ షోకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కయదూ లోహర్. ఈ షోతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకునే పనిలో పడ్డారు. ప్రస్తుతం నాని ప్యారడైజ్ లో నటిస్తున్న ఈమె.. తమిళంలో గ్లామర్ వైపు అడుగులు వేస్తున్నారు. మరి ఈ గ్లామర్ రూట్ వీళ్లకు ఎంతవరకు సక్సెస్ ఇస్తుందో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కరెంట్ లేకుండానే కూలింగ్! ఇక ఏసీతో పనిలేదు

వామ్మో… ఆ ఊరి నిండా పాములే! ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న గ్రామం

Aadhaar Update: ఆధార్ అప్డేట్‌‌పై కేంద్రం గుడ్‌ న్యూస్‌

భీమేశ్వరాలయ సమీపంలో అరుదైన శ్వేతనాగు.. ప్రత్యక్షం

కుక్కను వెంబడిస్తూ వెళితే.. బయటపడిన 18 వేల ఏళ్ల రహస్య ప్రపంచం

Follow Us