టాలీవుడ్‌కు 2026 లక్కీ ఇయర్.. బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోల రేంజ్ కంబ్యాక్ రికార్డులు ఇవే!

Edited By:

Updated on: Jul 17, 2026 | 6:48 PM

Tollywood 2026 Movie Success: 2026 ఏడాది టాలీవుడ్‌కు సరికొత్త ఊపును తీసుకువచ్చింది. ఎన్నాళ్లుగానో బిగ్ హిట్స్ కోసం ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అఖిల్, శర్వానంద్ మరియు సమంతలు ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్‌బస్టర్ విజయాలతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చారు.

2026 టాలీవుడ్‌కు చాలా స్పెషల్ మెమరీస్ ఇచ్చింది. తెలుగు ఆడియన్స్‌ ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఎన్నో సక్సెస్‌లు ఈ ఏడాది ఆడియన్స్‌ను పలకరించాయి. ఈ ఇయర్‌ స్టార్ హీరోల కెరీర్‌లో కొత్త జోష్‌ తీసుకువచ్చింది. ఇంతకీ అలా ఫామ్‌లోకి వచ్చిన హీరోలు ఎవరు..? వాళ్లు సెట్ చేసిన చేస్తున్న రికార్డ్స్ ఏంటి..? 2026కు బ్లాక్ బస్టర్‌ సక్సెస్‌తో వెల్‌ కం చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. మన శంకర వరప్రసాద్‌ గారు సినిమాతో ఆడియన్స్‌ ముందుకు వచ్చిన చిరు, ఏకంగా రీజినల్‌ ఇండస్ట్రీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమాలో ఆచార్య, భోళా శంకర్‌ ఫెయిల్యూర్స్‌ను ఆడియన్స్‌ మరిపోయేలా చేశారు మెగాస్టార్‌. మెగా పవర్‌ స్టార్‌ రామచరణ్ కూడా బిగ్ కంబ్యాక్ ఇచ్చారు. ట్రిపులార్ తరువాత మరో బ్లాక్ బస్టర్ కోసం ఎదురుచూస్తున్న చరణ్‌కు పెద్ది సినిమా ఆశించిన విజయాన్ని అందించింది. రూరల్‌ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన పెద్ది, చరణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్ సరసన నిలిచింది. చరణ్ ఫ్యాన్స్‌లో కొత్త జోష్ తీసుకువచ్చింది. యంగ్ హీరోలు అఖిల్ శర్వానంద్‌ కూడా బిగ్ కం బ్యాక్ ఇచ్చారు. సంక్రాంతి బరిలో నారి నారి నడుమ మురారి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శర్వా, తరువాత బైకర్ సినిమాతో పరవాలేదనిపించారు. మాస్‌ యాక్షన్ లవ్‌ స్టోరి లెనిన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖిల్, కెరీర్‌లో ఫస్ట్ టైమ్‌ బ్లాక్ బస్టర్‌ను టేస్ట్ చేశారు. మా ఇంటి బంగారం సినిమాతో లేడీ ఓరియంటెడ్ జానర్‌లో కొత్త బెంచ్‌ మార్క్ సెట్ చేశారు సమంత. అన్‌ సీజన్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా వంద కోట్ల మార్క్‌ను క్రాస్ చేసి కొత్త చరిత్ర సృష్టించింది. ఇలా చాలా రోజులుగా బిగ్ హిట్స్ కోసం ఎదురుచూస్తున్న స్టార్స్ కం బ్యాక్ ఇస్తుండటంతో 2026 లక్కి ఇయర్ అంటున్నారు ఫ్యాన్స్‌.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టాలీవుడ్‌లో మరోసారి బాక్సాఫీస్ షేక్.. అనిల్ రావిపూడి – బాలయ్య కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్!

ప్యాన్ ఇండియా ఇమేజ్ కాదు.. పెద్ద డ్యామేజ్.. స్టార్ బ్యూటీల కెరీర్ గ్రాఫ్ చెబుతున్న నిజాలు!

పెళ్లి తెచ్చిన లక్.. బ్లాక్‌బస్టర్ కమ్‌బ్యాక్..!

కొరియా నుంచి ఆఫ్రికా వరకు.. ఖండాలు దాటేస్తున్న టాలీవుడ్ కథలు!

Follow Us