హిందీలో మన హీరోయిన్లపై ఎందుకింత చిన్నచూపు..?

Updated on: Jun 26, 2026 | 10:40 AM

బాలీవుడ్‌లో దక్షిణాది నటీమణులను చిన్నచూపు చూస్తున్నారనే అనుమానాలు బలపడుతున్నాయి. సినిమాలు హిట్టయితే క్రెడిట్ హీరోలకు, దర్శకులకు దక్కుతుండగా, ఫ్లాపయితే మాత్రం హీరోయిన్‌లను టార్గెట్ చేస్తున్నారు. రష్మిక మందన, నయనతార వంటి టాప్ హీరోయిన్ల విషయంలోనూ ఈ ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. హిట్లు లేని మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డేలకు మరింత అన్యాయం జరుగుతోంది.

బాలీవుడ్‌లో దక్షిణాది నటీమణులను చిన్నచూపు చూస్తున్నారనే అనుమానాలు ఇటీవల కాలంలో మరింత బలపడుతున్నాయి. అక్కడ జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సినిమాలు విజయవంతం అయితే క్రెడిట్ మొత్తం హీరోలకు, దర్శకులకు అంకితం చేస్తుండగా, ఒకవేళ చిత్రం అపజయం పాలైతే మాత్రం దక్షిణాది హీరోయిన్‌లను టార్గెట్ చేస్తున్నారు. దీని వెనుక ఉన్న కారణాలు ఆసక్తికరంగా మారాయి. దక్షిణాదిన రష్మిక మందనకున్న క్రేజ్ అపారం. అయితే, బాలీవుడ్‌లో యానిమల్, ఛావా వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు ఉన్నప్పటికీ, వాటి విజయం హీరోలు, దర్శకుల ఖాతాలోకే వెళ్లింది. గతేడాది ఆమెకు సంబంధించిన కొన్ని చిత్రాల ఫలితాలు ప్రతికూలంగా మారినప్పుడు నార్త్ మీడియా ఆమెను తప్పుబట్టింది. తాజాగా విడుదలైన కాక్ టైల్ 2లో కృతి సనన్‌తో పాటు రష్మిక కూడా నటించినా, కృతి పేరు చెప్పినంతగా రష్మికను హైలైట్ చేయకపోవడం, ఆమె పాత్రకు తగిన వెయిటేజ్ ఇవ్వలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక జవాన్ చిత్రం రూ. 1200 కోట్లు వసూలు చేసినప్పటికీ, క్రెడిట్ అంతా షారుఖ్ ఖాన్‌కే ఇచ్చారు. నయనతారకు తగిన గుర్తింపు రాలేదు. జవాన్ దక్షిణాదిన విజయం సాధించడానికి షారుఖ్ ఇమేజ్‌తో పాటు నయనతార క్రేజ్ కూడా కారణమని దక్షిణాదికి అర్థమైనా, బాలీవుడ్ మాత్రం విజయం కేవలం హీరోదే అన్నట్లుగా వ్యవహరించింది. హిట్ చిత్రాలున్న హీరోయిన్ల పరిస్థితే ఇలా ఉంటే, మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే వంటి వారికి మరింత అన్యాయం జరుగుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

Published on: Jun 26, 2026 10:38 AM
Follow Us