టాలీవుడ్‌లో పెళ్లి సందడి.. నెల రోజుల్లో 3 పెళ్లిళ్లు

Edited By:

Updated on: Feb 25, 2026 | 7:14 PM

టాలీవుడ్‌లో పెళ్లిళ్ల పండగ మొదలైంది! నెల రోజుల్లోపే ముగ్గురు స్టార్స్ పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఫిబ్రవరి 26న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, మార్చి 6న అల్లు శిరీష్, నయనికా, మార్చి 20న పునర్నవి భూపాలం, హేమంత్ వర్మ వివాహం చేసుకోనున్నారు. ఈ పెళ్లిళ్లతో తెలుగు సినీ పరిశ్రమలో సందడి నెలకొంది.

టాలీవుడ్‌లో చాలా రోజుల తర్వాత పెళ్లి సందడి కనిపిస్తుంది. ఒక్కరు ఇద్దరు కాదు ముగ్గురు జంటలు నెల రోజుల్లోపే పెళ్లి పీటలెక్కబోతున్నాయి. ముహూర్తం సమీపిస్తుండటంతో పెళ్లి పనుల్లో బిజీ అయిపోయారు. కార్డులిస్తూ కొందరు బిజీ అయితే.. మంటపానికి వెళ్లే దారిలో మరికొందరున్నారు. మరి ఆ కొత్త జంటలెవరు..? ఎవరి పెళ్లి తేదీ ఎప్పుడో చూద్దామా..? అప్పుడెప్పుడో 8 ఏళ్ళ కింద గీతా గోవిందం సినిమాలో జరిగిన ఈ సీన్.. విజయ్ దేవరకొండ, రష్మిక లైఫ్‌లో రియల్‌గానే జరగబోతుంది. ఫిబ్రవరి 26న ఈ జంట ఉదయ్‌పూర్‌లో ఒక్కటి కానున్నారు. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.. ఈ జంట అక్కడికి చేరుకున్నారు. అతి తక్కువ మంది సమక్షంలోనే పెళ్లి జరగనుంది.. మార్చి 4న తాజ్ కృష్ణలో రిసెప్షన్ భారీగా ఉండబోతుంది. అల్లు వారింట కూడా పెళ్లి సందడి మొదలైపోయింది. మార్చి 6న అల్లు శిరీష్ నయనికా పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ ఇద్దరి పెళ్లి పనులు ఆల్రెడీ మొదలయ్యాయి. మొన్న చిరంజీవికి.. నిన్న పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేకంగా పెళ్లికి ఆహ్వానం పలికారు అల్లు కుటుంబ సభ్యులు. మొన్నీమధ్యే కుటుంబ సభ్యులతో పాటు.. ఇండస్ట్రీలో స్నేహితులకు పార్టీ కూడా ఇచ్చారు శిరీష్. అల్లు శిరీష్, నయనిక పెళ్లికి ఇండస్ట్రీ నుంచే కాదు.. దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. ఇక బిగ్ బాస్ బ్యూటీ పునర్నవి భూపాలం సైతం మార్చి 20న హేమంత్ వర్మను పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే నిశ్చితార్థం కూడా అయిపోయింది. మొత్తానికి నెల రోజుల్లోపే తెలుగు ఇండస్ట్రీలో మూడు పెళ్లిళ్లు జరగబోతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sai Pallavi: బాలీవుడ్‌లో బిజీగా ఉన్న సాయి పల్లవి.. ఇక టాలీవుడ్ కు దూరమేనా

స్లో గా సైడ్ అవుతున్న స్టార్ హీరోలు. కళ తప్పుతున్న కోలీవుడ్

Kathi 2: వైరల్ అవుతున్న ఖైదీ 2 అప్‌డేట్.. సంతోషం వ్యక్తం చేస్తున్న అభిమానులు

YouTuber Komali: కోమలి ఫ్లాట్ లో సూసైడ్ నోట్.. చనిపోవడానికి కారణం ఇదేనా !

PM Modi: విజయ్‌ దేవరకొండ తల్లిదండ్రులకు ప్రధాని మోదీ లేఖ

Published on: Feb 25, 2026 07:11 PM
Follow Us