Tamannaah Bhatia: డేంజర్ జోన్‌లో మిల్కీ బ్యూటీ కెరీర్..అది తప్ప మరో ఆప్షన్ కనిపించట్లేదా..?

Edited By:

Updated on: Oct 17, 2026 | 6:13 PM

దాదాపు 18 ఏళ్ల సినీ ప్రయాణంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తమన్నా ఇప్పుడు విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ‘లస్ట్‌ స్టోరీస్‌ 2’ తర్వాత బోల్డ్‌ కంటెంట్‌ ఉన్న ప్రాజెక్టులపై ఆమె ఆసక్తి చూపుతున్నట్లు చర్చ జరుగుతోంది. ‘రాగిణి ఎంఎంఎస్‌ 3’లో నటిస్తున్నట్లు వార్తలు వస్తుండగా, ‘ది డర్టీ పిక్చర్‌ 2’లోనూ అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఈ ప్రాజెక్టులపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

తన కెరీర్‌ను కాపాడుకోవాలంటే బోల్డ్ స్టెప్ తీసుకోక తప్పదని మిల్కీ బ్యూటీ తమన్నా గట్టిగా డిసైడ్ అయిపోయారా..? అందుకే తన 18 ఏళ్ళ ప్రయాణంలో ఎన్నడూ లేనంతగా వరుసపెట్టి బోల్డ్ సినిమాలను ఓకే చేస్తున్నారా..? రాగిణి ఎంఎంఎస్ 3 సినిమానే ఎక్స్‌ట్రీమ్ అనుకుంటే.. దాన్ని మించిన మరో డర్టీ పిక్చర్‌లో తమన్నా నటించబోతున్నారా..? అసలు మిల్కీ బ్యూటీ ప్లాన్ ఏంటి..? ఇండస్ట్రీకి వచ్చాక దాదాపు 18 ఏళ్ళ పాటు నో కిస్సింగ్ పాలసీ ఫాలో అయ్యారు తమన్నా. కానీ తన రూట్ పూర్తిగా మార్చేశారిప్పుడు. ఆ మధ్య వచ్చిన లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్‌లో పాత రూల్స్ అన్నీ పక్కనపెట్టి లిప్‌లాక్ సీన్స్‌తో పాటు ఇంటిమేట్ సీన్స్‌లో నటించి అందరికీ షాక్ ఇచ్చారు. అదే బాటలో వెళ్తూ రాగిణి ఎంఎంఎస్ 3 లాంటి పక్కా బోల్డ్ అండ్ హారర్ సినిమాలో నటిస్తున్నారు. రాగిణి ఎంఎంఎస్ ఫ్రాంచైజీలోనే ఇంటిమేట్ సీన్స్‌కు ఏమాత్రం కొదవ ఉండదు.. పార్ట్ 3లోనూ తమన్నా గ్లామరస్‌గా కనిపించబోతున్నారని తెలుస్తుంది. ఇది సెట్స్‌పై ఉండగానే ది డర్టీ పిక్చర్ 2లోనూ హీరోయిన్‌గా తమన్నాని తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. విశేషం ఏంటంటే ఈ రెండు బోల్డ్ ప్రాజెక్టులను నిర్మిస్తున్నది ఏక్తా కపూరే. మొత్తానికి కెరీర్‌లో ఖాళీ అనే పదమే లేకుండా ఎలాగోలా బిజీగా ఉండటమే లక్ష్యంగా మిల్కీ బ్యూటీ అడుగులేస్తున్నారు. కుదిరితే హీరోయిన్ ఆఫర్స్, లేదంటే క్రేజీ స్పెషల్ సాంగ్స్, అదీ కాకపోతే ఓటీటీ వెబ్ సిరీస్‌లు, ఇవేవీ కాదంటే ఇలాంటి బోల్డ్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఏదేమైనా 35 దాటాక తమన్నా గేర్ మార్చి వరుస ఆఫర్లతో ఇండస్ట్రీని షేక్ చేస్తుండటం విశేషం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ 10 విన్నర్ ఎవరో తేల్చేసిన కౌశల్!

Weather Report: దసరా పండగ వేళ చల్లని కబురు.. తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్

ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్.. దసరాకు 7 వేల ప్రత్యేక బస్సులు

భార్యను లాడ్జ్‌కి తీసుకెళ్లాడు.. రాత్రంత్రా హ్యాపీగా ఉన్నారు.. ఉదయాన్నే బాత్‌రూంలో

Jabardasth Actor Babu: వా.. బాబు..! జబర్దస్త్‌ కమెడియన్ TO సక్సెస్‌ఫుల్ డైరెక్టర్!

Loading...
Unable to load recommendations.
Follow Us