‘ఆ ఇద్దరి గురించి నోరు జారాడు..’ పాపం !! అడ్డంగా దొరికిన తమన్

Updated on: Feb 26, 2026 | 12:52 PM

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ 'బ్యాండ్ మేళం' టీజర్ లాంచ్ వేడుకలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. హర్ష్ రోషన్, శ్రీదేవిల పెయిర్‌పై 'కెమిస్ట్రీ అదిరింది, ఫిజిక్స్ కాకుండా చూసుకోండి' అంటూ సరదా పంచ్ వేశారు. అయితే నెగిటివ్ మీనింగ్ రాకుండా వెంటనే 'గొడవలు పడకండి' అని వివరించారు. '5వ తరగతి ఫెయిల్' అంటూ తనదైన స్టైల్‌లో అమాయకత్వం ప్రదర్శిస్తూ స్పీచ్ ముగించారు. సెలబ్రిటీల మాటలు వైరల్ అవ్వడం ఈ మధ్య సర్వసాధారణం.

టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తాజాగా జరిగిన ‘బ్యాండ్ మేళం’ సినిమా టీజర్ లాంచ్ వేడుకలో ‘కోర్ట్’ ఫేమ్ హర్ష్ రోషన్, శ్రీదేవిల పెయిర్ గురించి మాట్లాడుతూ ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ కపుల్‌ను చూసి మురిసిపోయిన తమన్.. సరదాగా “మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది, కానీ ఆ కెమిస్ట్రీ కాస్తా ఫిజిక్స్ కాకుండా చూసుకోండి” అంటూ ఓ ఇంట్రెస్టింగ్ పంచ్ వేశారు. అయితే ఇది ఎక్కడ నెగటివ్ మీనింగ్‌లోకి వెళ్లి వైరల్ అవుతుందో అని వెంటనే రియలైజ్ అయిన తమన్.. తన మాటలను సర్దుకుంటూ, “నేను ఆ ఉద్దేశంతో అనలేదమ్మా.. మీరిద్దరూ భవిష్యత్తులో గొడవలు పడకండి అని మాత్రమే చెబుతున్నా. మీ పెయిర్ చూడటానికి చాలా బాగుంది, ఎప్పుడూ ఇలాగే కలిసుండండి” అంటూ క్లారిటీ ఇచ్చి వాతావరణాన్ని కూల్ చేశారు. అంతటితో ఆగకుండా “అసలే నేను ఐదో తరగతి ఫెయిల్ అయ్యాను.. నాకేం పెద్దగా తెలియదు” అంటూ తనదైన స్టైల్లో అమాయకత్వం నటిస్తూ స్పీచ్ ముగించేసారు. ఈ మధ్య కొన్ని ఈవెంట్స్‌లో సెలబ్రెటీస్ మాట్లాడుతున్న మాటలు ఇలాగే వైరల్ అవుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vijay-Rashmika Marriage: రష్మికకి అత్తామామలు పెట్టిన.. కండీషన్‌ ఏంటంటే..

Follow Us