పెద్దికి రెచ్చిపోయారు.. ఇప్పుడు దొరికిపోయారు..!

Edited By:

Updated on: Jun 22, 2026 | 9:24 PM

బాలీవుడ్‌లో బికినీ, ఇంటిమేట్ సీన్స్‌ను ప్రశంసించే విమర్శకులు, సౌత్ సినిమాల్లో గ్లామర్ షో కనిపిస్తే మాత్రం విమర్శలు చేయడం డబుల్ స్టాండర్డ్స్ కాదా అనే చర్చ మొదలైంది. జాన్వీ కపూర్ నటించిన సన్నివేశాలపై వచ్చిన విమర్శల నేపథ్యంలో, రెండు పరిశ్రమలకు వేర్వేరు ప్రమాణాలు ఎందుకన్న ప్రశ్న సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

హిందీ సినిమాకు ఓ న్యాయం.. సౌత్ సినిమాకు మరో న్యాయమా..? అక్కడ హీరోయిన్లు బికినీలు వేసి ఇంటిమేట్ సీన్స్ చేస్తే బ్యూటీఫుల్ అంటున్న క్రిటిక్స్.. సౌత్ సినిమాలపై మాత్రం ఎందుకు విమర్శలు చేస్తున్నారు. నార్త్‌లో గ్లామర్ షోను వెనకేసుకొస్తున్న వాళ్లు.. సౌత్‌ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..? ఈ విషయంలో బాలీవుడ్ డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు..? తాజాగా విడుదలైన కాక్ టైల్ 2 సినిమాలో కృతి సనన్ బికినీ సీన్స్ చూసి బాలీవుడ్ క్రిటిక్స్ అంతా ఆహా ఓహో అంటూ తెగ పొగిడేస్తున్నారు. మరోవైపు ఆ సినిమాకు సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ ఇవ్వడాన్ని షాహిద్ కపూర్ తప్పు బట్టారు. కానీ అదే బాలీవుడ్ జనాలు సౌత్ సినిమాల్లో గ్లామర్ షో కాస్త పెరిగితే మాత్రం మహిళలను కించపరుస్తున్నారంటూ పనిగట్టుకుని మరీ విమర్శిస్తున్నారు. మొన్నటికి మొన్న పెద్దిలో కంటెంట్ ఎంతో ఉన్నా.. కేవలం జాన్వీ కపూర్ సీన్స్ పట్టుకుని నార్త్ క్రిటిక్స్ అనవసరమైన రాద్ధాంతం చేశారు. జయా బచ్చన్, కరీనా లాంటి సీనియర్లు సైతం సౌత్‌లో హీరోయిన్లను కేవలం గ్లామర్ కోసమే వాడుకుంటున్నారంటూ విమర్శించారు. కానీ తమ ఇండస్ట్రీలో దశాబ్దాలుగా నడుస్తున్న బికినీ ట్రెండ్, ఇంటిమేట్ సీన్స్‌పై మాత్రం ఈ సో కాల్డ్ సీనియర్లు నోరు మెదపరనే విమర్శలున్నాయి. బాలీవుడ్‌లో లిప్ లాక్స్, బికినీ షోలు అనేవి చాలా కామన్ అంటూ మేకర్స్ వాటిని గొప్పగా ప్రమోట్ చేసుకుంటున్నారు. తమ దగ్గర ఎంత పచ్చిగా తీసినా ఫ్యాషన్ అని పొగిడే వాళ్ళు.. సౌత్‌పై మాత్రం చిన్నచూపు చూస్తుంటారు.. ఇక్కడే వాళ్ల డబుల్ స్టాండర్డ్స్ బయటపడుతున్నాయని మన ఫ్యాన్స్ గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. సౌత్‌లో కనిపించే హీరోయిన్ల గ్లామర్ షో.. నార్త్‌లోకి వచ్చేసరికి మాయం అవుతుందా అనేదే ఇక్కడ అసలు ప్రశ్న. కాక్ టైల్ 2 ఒక్కటే కాదు.. బాలీవుడ్‌లో కొన్నేళ్లుగా ఎన్నో సినిమాల్లో హీరోయిన్లను గ్లామరస్‌గా చూపించడమనేది కామన్. ఇంత చేసినా.. అప్పుడప్పుడూ సౌత్ నుంచే ఎదిగిన కొందరు హీరోయిన్స్ మళ్లీ ఇక్కడి సినిమాలపైనే సెటైర్లు వేయడం కొసమెరుపు. ఇదెప్పటికి మారుతుందో మరి..?

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఖాళీగా ఓలా.. అయినా ఉబర్‌ కోసం అరగంట వెయిటింగ్‌! బెంగళూరులో వింత ఘటన

11 ఏళ్లకే యూకే యూత్ పార్లమెంట్ సభ్యురాలిగా రికార్డ్‌.. వైజాగ్ టు లండన్ కలశ నాయుడు ప్రయాణం

ఉద్యోగితో రూ. 2.5 లక్షల ఫిట్‌నెస్ బెట్ లో ఓడిన జెరోదా బాస్

ఫోన్‌ దొంగిలించి పారిపోతూ కుప్పకూలిన దొంగ.. క్షణాల్లో ప్రాణాలు గాల్లో..

వీడు మామూలోడు కాదు.. పగలు ఇళ్లకు రంగులు.. రాత్రయితే చాలు..

Follow Us