Shraddha Kapoor: శ్రద్ధాకపూర్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా ??

Edited By:

Updated on: Mar 21, 2026 | 6:11 PM

బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న శ్రద్ధా కపూర్, 'సాహో' తర్వాత సౌత్‌లోనూ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. డ్యాన్స్‌లు, పెర్ఫార్మెన్స్‌లతో మెప్పించే ఆమె, ప్రస్తుతం రాహుల్ మోడీతో పెళ్లి వార్తలతో వార్తల్లో నిలిచింది. ఉదయ్‌పూర్‌లో వివాహం జరగనున్నట్లు ప్రచారం కాగా, పెళ్లి తర్వాత ఆమె కెరీర్ గ్యాప్ తీసుకుంటుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.

బాలీవుడ్‌లో తనకంటూ స్పెషల్‌ ప్లేస్‌ దక్కించుకున్న నటీమణుల ప్రస్తావన వస్తే వితౌట్‌ ఎనీ డౌట్‌ మెన్షన్‌ చేయాల్సిన పేరు శ్రద్ధా కపూర్‌. తెలుగులో ‘సాహో’ తర్వాత సినిమా చేయకపోయినా, ఆ మూవీ చేసినప్పటి నుంచీ మనం డార్లింగ్‌ గర్ల్ గా ఆమె మీద ఫోకస్‌ పెంచుతూనే ఉన్నాం. అలా చేయడానికి ఆమె వైపు నుంచి కూడా ఎఫర్ట్ లెస్‌ టాపిక్స్ చాలానే కనిపిస్తున్నాయి. డ్యాన్సులకు డ్యాన్సులు, పెర్ఫార్మెన్సులకు పెర్ఫార్మెన్సులు చేయగల హీరోయిన్ల ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ బాలీవుడ్‌లో శ్రద్ధాకపూర్‌ పేరు తప్పక లిస్టులో కనిపిస్తుంది. ఫ్యాషన్‌ అయినా, యాక్టింగ్‌ అయినా, డ్యాన్సులైనా, బాక్సాఫీస్‌ దగ్గర పోటీ అయినా.. విషయం ఏదైనా ఓ అడుగు ముందే ఉండటానికి ప్రయత్నిస్తుంటారు శ్రద్ధాకపూర్‌. స్త్రీ రెండు చాప్టర్లతో బాక్సాఫీస్‌ దగ్గర తనకంటూ స్పెషల్‌ ఇమేజ్‌ తెచ్చుకున్నారు ఈ బ్యూటీ. సాహోతర్వాత తెలుగులో బడా సినిమాల ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ నాయికగా శ్రద్ధాకపూర్‌ ఉండొచ్చనే మాట వినిపిస్తూనే ఉంటుంది. దీన్ని బట్టి శ్రద్ధకు సౌత్‌లో ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో కూడా అర్థం చేసుకోవచ్చు. సాహో టైమ్‌ లో డార్లింగ్‌తో శ్రద్ధకు సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ అనే వార్తలు వైరల్‌ అయ్యాయి. అయితే అవేమీ నిజం కాదు.. అంతా తూచ్‌ అనే విషయం కూడా అప్పుడే తెలిసిపోయింది. శ్రద్ధాకపూర్‌ – రాహుల్‌ మోదీతో చట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారని త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అవుతున్నారని బాలీవుడ్‌ న్యూస్‌. ఈ విషయం గురించి అధికారికంగా న్యూస్‌ లేకపోయినా, ఉదయ్‌పూర్‌లో ఈ ఏడాది ఆఖర్లోగానీ, వచ్చే ఏడాది ప్రారంభంలోగానీ పెళ్లి జరుగుతుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు అప్పటికి పూర్తయిపోతాయి కాబట్టి, పెళ్లి తర్వాత శ్రద్ధ కొన్నాళ్ల పాటు గ్యాప్‌ తీసుకుంటారా? నయా ప్రాజెక్టులకు సైన్‌ చేస్తారా? అనే చర్చ కూడా జరుగుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అజ్ఞాతవాసానికి కార్తికేయ స్వస్తి చెప్పేదెప్పుడు ??

నేషనల్ జియోగ్రాఫిక్ 33 లిస్టులో ప్రియాంక, ఆలియా

Spider-Man: ఆకట్టుకుంటున్న స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ట్రైలర్

Dhurandhar 2: సూపర్ డూపర్ టాక్ తో దూసుకుపోతున్న ధురంధర్

దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..

Follow Us