Samantha: సినిమా హిట్ టాక్ రావడంతో.. సమంత భావోద్వేగ పోస్ట్..

Updated on: Nov 12, 2022 | 9:09 AM

పాన్ ఇండియా హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత క్లిష్ట పరిస్థితిల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఓ పక్క మయోసైటివ్ వ్యాధితో బాధపడుతూనే... ఒంటరిగా జీవిస్తూ..

పాన్ ఇండియా హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత క్లిష్ట పరిస్థితిల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఓ పక్క మయోసైటివ్ వ్యాధితో బాధపడుతూనే… ఒంటరిగా జీవిస్తూ.. తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. దానికితోడు.. తను చేస్తున్న వరుస ప్రాజెక్ట్స్ తో.. డేట్స్‌తో ఏం చేయాలో పాలుపోలేని స్థితిలో ఉన్నారు. ఇక అలాంటి పరిస్థితుల్లోనూ.. మొక్కవోని ఆత్మవిశ్వాసంతో.. తన సినిమాలను ఫినిస్ చేస్తున్నారు సమంత. ఈ క్రమంలోనే తాజాగా రిలీజైన తన యశోద మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడతో ఫుల్ ఖషీ అవుతున్నారు. ఖుషీ అవడమే కాదు.. తాజాగా తన ఫ్యాన్స్ అండ్‌ ఫాలోవర్స్‌ కోసం ఓ చిన్న ట్వీట్ చేశారు. గతంలో కంటే ఈసారి, సినిమాను ప్రమోట్ చేయడంలో మీ అందరి సహకారం ఉంటుందని ఆశిస్తున్నాను. రిలీజ్‌కు ముందు మీరు నాపై నా సినిమా పై కురిపించిన ఆప్యాయతకు కృతజ్ఞతలు. మీరు నా సినిమాను మరింతగా ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను. థాంక్యూ” అంటూ భావోద్వేగ ట్వీట్ చేశారు సమంత.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Allu Arjun: బన్నీ చేసిన సాయానికి మలయాళీలు ఫిదా..

Digital TOP 9 NEWS: దివ్యాంగురాలైన కుమార్తెకు శ్రీకృష్ణుడితో పెళ్లి !! | బిచ్చగాడైన బిలియనీర్ !!

Published on: Nov 12, 2022 09:09 AM
Loading...
Unable to load recommendations.
Follow Us