Sai Durgha Tej: బిగ్ హిట్ కోసం వెయిటింగ్.. సాయి తేజ్ కష్టం ఫలించేనా?
‘విరూపాక్ష’ విజయంతో జోరుమీదున్న సాయిదుర్గా తేజ్ తన తదుపరి భారీ ప్రాజెక్ట్ ‘సంబరాల ఏటిగట్టు’ కోసం దాదాపు రెండున్నరేళ్లు కేటాయించారు. పీరియాడిక్ కథకు తగ్గట్టుగా లాంగ్ హెయిర్, గడ్డం, ఫిట్నెస్తో ప్రత్యేక మేకోవర్ సాధించారు. తాజాగా షూటింగ్ పూర్తవడంతో ఆ పాత్ర నుంచి బయటకొచ్చి, పుట్టినరోజు సందర్భంగా కొత్త లుక్‌లో కనిపించారు. త్వరలో ప్రమోషన్లు ప్రారంభించి, సంక్రాంతికి సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
విరూపాక్ష మరో సక్సెస్‌తో సాలిడ్ ఫామ్‌లో ఉన్న సాయిదుర్గా తేజ్, కెరీర్లో మరో బిగ్ కోసం ఎదురుచూస్తున్నారు. అందుకోసం ఏకంగా రెండున్నరేళ్లు కేటాయించారు. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన సంబరాల ఏటిగట్టు కోసం తన మేకోవర్ని పూర్తిగా మార్చేసిన సుప్రీమ్ హీరో.. ఫైనల్‌గా ఆ క్యారెక్టర్ నుంచి బయటకొచ్చారు. ఇంతకీ సినిమా స్టేటస్ ఏంటి? విరూపాక్ష సినిమాతో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తన మార్కెట్ స్టామినాని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు సాయిదుర్గా తేజ్. ఆ సక్సెస్ ఇచ్చిన కిక్‌తో, తన కెరీర్లో ఎప్పుడూ ట్రై చేయని పీరియాడిక్ కథను పట్టాలెక్కించారు. అంతేకాదు ఆ సినిమా కోసం తన కెరీర్లో ప్రైమ్ టైమ్‌ను కేటాయించారు సాయి. తాము నమ్మిన కథల కోసం ఎంత శ్రమించడానికైనా, ఎన్ని రోజులు కేటాయించడానికైనా వెనకాడరు మన కథానాయకులు. సాయిదుర్గా తేజ్ కూడా సంబరాల ఏటిగట్టు కోసం దాదాపు రెండున్నరేళ్లు టైమ్ ఇచ్చారు. ఇన్ని రోజుల పాటు లాంగ్ హెయిర్, బియర్డ్ లుక్‌లోనే ఉన్నారు. కేవలం జుట్టు, గడ్డం మాత్రమే కాదు, ఆ పీరియాడిక్ పాత్రకు తగ్గట్టుగా ఫిజికల్‌గా కూడా మేకోవర్ అయ్యారు తేజ్. ఏకంగా రెండేళ్ల పాటు సిక్స్‌ప్యాక్‌ను మెయిన్టైన్ చేస్తూ సినిమాను పూర్తి చేశారు. దాదాపు రెండున్నరేళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. షూటింగ్ కంప్లీట్ కావడంతో సాయిదుర్గా తేజ్ నార్మల్ లుక్‌లోకి మారిపోయింది. తన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు నయా లుక్‌లో దర్శనమిచ్చారు. అంతేకాదు త్వరలో సంబాల ఏటి గట్టు ప్రమోషన్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సంక్రాంతి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు కష్టపడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ 10 విన్నర్ ఎవరో తేల్చేసిన కౌశల్!
Weather Report: దసరా పండగ వేళ చల్లని కబురు.. తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్.. దసరాకు 7 వేల ప్రత్యేక బస్సులు
భార్యను లాడ్జ్‌కి తీసుకెళ్లాడు.. రాత్రంత్రా హ్యాపీగా ఉన్నారు.. ఉదయాన్నే బాత్రూంలో
Jabardasth Actor Babu: వా.. బాబు..! జబర్దస్త్ కమెడియన్ TO సక్సెస్ఫుల్ డైరెక్టర్!