Kiraak RP – Rocking Rakesh: నెల్లూరు పెద్దారెడ్డి చేపల పుసులు వారి భిక్షే.. ఆర్పీ పై రాకేష్‌ షాకింగ్‌ కామెంట్స్‌..వీడియో.

|

Feb 11, 2023 | 10:00 AM

మరో జబర్దస్త్ కమెడియన్‌ రాకింగ్‌ రాకేశ్‌ ఈ ఫుడ్‌ సెంటర్‌పై షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాకేష్ కిరాక్ ఆర్పీ చేపల పులుసు జబర్దస్త్ ప్రోగ్రామ్ పెట్టిన భిక్ష..

జబర్దస్త్ కమెడియన్‌ కిర్రాక్‌ ఆర్పీ ప్రారంభించిననెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఫుడ్‌ సెంటర్‌ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. మొదట కూకట్‌పల్లిలో ప్రారంభించిన ఈ ఫుడ్‌ సెంటర్‌కు బాగా రెస్పాన్స్‌ వచ్చింది. ఒకానొకదశలో బౌన్సర్లతో కస్టమర్లను కంట్రోల్‌ చేయాల్సి వచ్చింది. దీంతో కొద్ది రోజుల్లోనే ఈ షాపు మూత పడింది. కొద్ది రోజుల్లోనే ఆర్పీ మళ్లీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు షాపును పునఃప్రారంభించాడు. కాగా ఈ మధ్యన తన నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఒక ఇంటర్వ్యూలో వాపోయాడు ఆర్పీ. పని గట్టుకుని ఒక పెయిడ్‌ బ్యాచ్‌ తనపై కుట్రపన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది మరవకముందే మరోసారి వార్తల్లోకి ఎక్కింది నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు. అదేంటంటే.. మరో జబర్దస్త్ కమెడియన్‌ రాకింగ్‌ రాకేశ్‌ ఈ ఫుడ్‌ సెంటర్‌పై షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాకేష్ కిరాక్ ఆర్పీ చేపల పులుసు జబర్దస్త్ ప్రోగ్రామ్ పెట్టిన భిక్ష అని చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఆర్పీని ఈ మధ్య ఏమైనా కలిశారా? అన్న ప్రశ్నకు.. ‘లేదండి.. అంత పెద్దవాళ్లను కలిసేంత అదృష్టం నాకు లేదు. మేమేదో చిన్న ఆర్టిస్టులం, వాళ్లు చాలా పెద్దవాళ్లు’ అని పరోక్షంగా కిర్రాక్‌ ఆర్పీని విమర్శించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

 

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..

Published on: Feb 11, 2023 08:41 AM