ఉత్తరాది ప్రేక్షకులను ఫిదా చేస్తానంటున్న బ్యూటీస్‌

Edited By:

Updated on: May 27, 2026 | 4:38 PM

బాలీవుడ్‌లో రష్మిక మందన్న స్థానం మరింత బలపడుతుండగా, పూజా హెగ్డే మరియు మృణాల్ ఠాకూర్ మాత్రం భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ‘కాక్‌టెయిల్ 2’తో రష్మిక మరోసారి నార్త్‌లో తన క్రేజ్ చూపిస్తుండగా, వరుణ్ ధావన్‌తో చేస్తున్న ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ సినిమాపైనే పూజా, మృణాల్ ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా హిట్ అయితేనే వారి కెరీర్‌కు ఊపిరి వస్తుందని ట్రేడ్ భావిస్తోంది.

రష్మిక బేఫికర్‌గా ఉన్నారు. ఎందుకంటే, ఆమె ఇప్పుడు కొత్తగా ప్రూవ్‌ చేసుకోవాల్సిందేమీ లేదు. పైపెచ్చు నార్త్ బెల్ట్ లో ఆమెకంటూ ఓ స్పెషల్‌ ప్లేస్‌ ఆల్రెడీ క్రియేట్‌ అయింది. కానీ, మృణాల్‌ అండ్‌ పూజాహెగ్డే పరిస్థితి అలా లేదు. వాళ్లకు సౌత్‌లోనూ పర్ఫెక్ట్ ప్లేస్‌ లేదిప్పుడు. నార్త్ సంగతి సరే సరే.. అందుకే ఈ సారి ఎలాగైనా హిట్‌ కొట్టాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. యానిమల్‌ సినిమా తర్వాత నార్త్ లో నెక్స్ట్ లెవల్‌ హీరోయిన్‌గా ప్రూవ్‌ చేసుకున్నారు రష్మిక మందన్న. ఆమెనిప్పుడు సౌత్‌ హీరోయిన్‌ అనడం లేదెవ్వరూ. ప్యాన్‌ ఇండియా బ్యూటీల రేసులోనే కన్సిడర్‌ చేస్తోంది ట్రేడ్‌. నేషనల్‌ క్రష్‌ ఉత్తరాదిన చేస్తు్న్న లేటెస్ట్ మూవీ ‘కాక్‌టెయిల్‌2’. షాహిద్‌ కపూర్‌తో కలిసి నటిస్తు్న్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్నతో పాటు కృతి సనన్‌ కూడా ఉన్నారు. ఇద్దరి మధ్య గ్రేస్‌ విషయంలో ఎప్పటికప్పుడు పోటీ కనిపిస్తూ ఉన్నా, సౌత్‌లో ఉన్న క్రేజ యాడ్‌ కావడంతో రష్మికకే కాసిన్ని ఎక్కువ మార్కులు పడుతున్నాయి. సో, దీన్ని బట్టి చూస్తే ఇప్పటికి నార్త్ లో రష్మికకు వచ్చిన ఢోకా ఏం లేదు. మరి అలాంటి భరోసా మృణాల్‌కీ, పూజా హెగ్డేకి కూడా రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు వారిద్దరూ కలిసి నటిస్తున్న ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ మూవీ హిట్‌ కావాలి. వరుణ్‌ ధావన్‌ హీరోగా నటిస్తున్న ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ మీద చాలా ఆశలే పెంచేసుకున్నారు పూజా అండ్‌ మృణాల్‌ ఠాకూర్‌. రీసెంట్‌గా విడుదలైన అడివిశేష్‌ ‘డెకాయిట్‌’ మంచి పేరు తెచ్చిపెడుతుందనుకున్నారు మృణాల్‌. కానీ, ఆ సినిమా డివైడ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇటు జననాయగన్‌ రిలీజ్‌ కోసం వెయిట్‌ చేశారు పూజా. సెన్సార్‌ సమస్యలతో వాయిదాపడింది. సో, ఈ ఇద్దరు హీరోయిన్లు ఇప్పుడు వరుణ్‌ ధావన్‌ సినిమా మీద హోప్స్ పెట్టుకున్నారు. ఈ మూవీ క్లిక్‌ అయితే, కెరీర్‌ కాసింత గాడిలో నడుస్తుందన్నది ఈ ఇద్దరమ్మాయిల ఆశ.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సోషల్ మీడియా అద్భుతం.. 15 ఏళ్ల తర్వాత కన్నవారి చెంతకు

పెన్షన్ కోసం 90 ఏళ్ల అత్తను వీపుపై 9 కి.మీ. మోసుకెళ్లిన కోడలు

US Visa Rules: ‘అమెరికా ఫస్ట్’ కొత్త వీసా షెడ్యూలింగ్ టూల్‌

పొలం చదును చేస్తుండగా అద్భుతం..అమితానందంలో రైతు!

నీటి కోసం బస్సును ఆపిన కోతి.. మూగజీవాల వీడియో వైరల్

Follow Us