రణబీర్ మెగా మాస్టర్‌ప్లాన్.. ఆరు భారీ సినిమాలతో బాక్సాఫీస్‌పై దండయాత్ర!
'యానిమల్' విజయంతో కెరీర్‌లో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న రణబీర్ కపూర్ వరుసగా భారీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. 'రామాయణం', 'లవ్ అండ్ వార్'తో పాటు 'ధూమ్ 4', 'యానిమల్ పార్క్', 'బ్రహ్మాస్త్ర 2' వంటి ప్రతిష్ఠాత్మక చిత్రాలు ఆయన లైనప్‌లో ఉన్నాయి. వచ్చే కొన్నేళ్ల పాటు బాలీవుడ్ బాక్సాఫీస్‌ను రణబీర్ రూల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ స్పీడు పెంచారు. వరుస సక్సెస్‌లతో సూపర్ ఫామ్‌లో ఉన్న ఈ క్రేజీ స్టార్, తన నెక్స్ట్ సినిమాల విషయంలోనూ భారీ స్కెచ్ వేశారు. తన క్రేజీ లైనప్‌తో ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ స్టార్‌గా మారిపోయారు. ఇంతకీ బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రణబీర్ సిద్ధం చేసిన ఆ క్రేజీ ప్రాజెక్ట్స్ ఏంటి అనుకుంటున్నారా..? అయితే ఫాలో దిస్ స్టోరి. ప్రజెంట్ తన కెరీర్‌లో బెస్ట్ ఫేజ్‌లో ఉన్నారు బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్. ‘యానిమల్’ ఇచ్చిన బ్లాక్ బస్టర్ సక్సెస్‌తో బాలీవుడ్‌లో తిరుగులేని స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం రణబీర్ చేతిలో ఉన్న సినిమాలు చూస్తుంటే.. వచ్చే ఐదారేళ్ల పాటు బాక్సాఫీస్ దగ్గర ఆయన రూలింగ్ నడవటం ఖాయంగా కనిపిస్తోంది. ఏకంగా ఆరు భారీ ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెడుతున్నారు. ప్రస్తుతం నితీష్ తివారీ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఎపిక్ మూవీ ‘రామాయణం’ షూటింగ్‌లో రణబీర్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఈ మూవీతో పాటు ప్యారలల్‌గా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘లవ్ అండ్ వార్’ మూవీలోనూ నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్స్ 2026, 2027లో బ్యాక్ టు బ్యాక్ ఆడియన్స్ ముందుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. రణబీర్ లైనప్ ఇక్కడితో ఆగిపోలేదు. ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ ఫ్రాంచైజీ ‘ధూమ్ 4’లో కూడా రణబీర్ నటించబోతున్నారనే న్యూస్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. వీటితో పాటు సందీప్ రెడ్డి వంగా సెన్సేషనల్ సీక్వెల్ ‘యానిమల్ పార్క్’, అలాగే అయాన్ ముఖర్జీ ‘బ్రహ్మాస్త్ర 2’ ప్రాజెక్ట్స్ కూడా క్యూలో ఉన్నాయి. ఏదేమైనా ఈ పవర్ ప్యాక్డ్ లైనప్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నారు రణబీర్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jr.NTR: ‘డ్రాగన్’ కోసం తారక్ టోటల్ ట్రాన్స్‌ఫర్మేషన్.. కొత్త లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా
వయసు పెరిగినా వేగం తగ్గలేదు.. టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న నలుగురు సీనియర్ స్టార్‌ల బిజీ షెడ్యూల్
ఇంటి పెరట్లో వింత శబ్దాలు.. వెళ్లి చూసిన ఓనర్ వెన్నులో వణుకు!
మైనర్ ను పెళ్లి చేసుకుని జైలుపాలయ్యాడు.. అక్కడి నుంచి తప్పించుకుని చివరికి ఇలా..
