Ranabaali: ‘రణబాలి’కి ఫస్ట్డే.. దిమ్మతిరిగే కలెక్షన్స్
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ‘రణబాలి’ సినిమా తొలి రోజు మంచి వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ నివేదికలు చెబుతున్నాయి. అక్టోబర్ 16న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.16.15 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. భారత్లో రూ.9.25 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చినట్లు నివేదిక పేర్కొంది. ఉదయం షోలతో పోలిస్తే రాత్రి షోల సమయానికి ఆక్యుపెన్సీ పెరిగినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.
విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన తాజా చిత్రం రణబాలి. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రావడమే కాదు మంచి టాక్ తెచ్చుకుంది. విజయ్, రష్మిక యాక్టింగ్, స్టోరీ బాగుందని.. డైరెక్టర్ రాహుల్ టేకింగ్ , డీటేలింగ్ నెక్ట్స్ లెవల్ అంటూ అందరూ ప్రశంసిస్తున్నారు. కలెక్షన్స్ కూడా షో.. షోకు పెరుగుతుండడంతో ఈ సినిమా మంచి కలెక్షన్స్ను కమాయిస్తోంది. టాలీవుడ్ రిపోర్ట్ ప్రకారం… రణబాలి మూవీ తొలి రోజు ఈ చిత్రం రూ. 16.15 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. భారత్లో తొలిరోజున 9.25 కోట్ల రూపాయల నెట్.. 10.75 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఓవర్సీస్లో రూ. 5.75 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. తెలుగు రాష్ట్రాలలో రూ. 9.25 కోట్లు, తమిళనాడులో రూ.15 లక్షలు, కర్ణాటకలో రూ. 1.10 కోట్లు వసూలు చేసింది. దేశవ్యాప్తంగా దాదాపు 2,515 స్క్రీన్లలో ప్రదర్శితమైన ఈ సినిమాకు తొలిరోజు సగటున 57 శాతం వరకు ఆక్యుపెన్సీ నమోదైంది. మొదటి రోజు మొత్తం 7.11 లక్షల మందికి పైగా ప్రేక్షకులు థియేటర్లకు తరలివచ్చారు. ఉదయం షోలు కాస్త నెమ్మదిగా అంటే 40.92%తో మొదలైనప్పటికీ, నైట్ షోల సమయానికి ఆక్యుపెన్సీ 67.92 శాతానికి పుంజుకుంది. కలెక్షన్స్ కూడా చాలా బాగా పెరిగినట్టు తెలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తన బిడ్డ పెళ్లికి రావాలంటూ.. సీఎం రేవంత్కు మారన్ ఆహ్వానం
పెళ్లికి వేలైంది.. ఇన్విటేషన్స్ పంచుతున్న మారన్
Sudigali Sudheer: నిశ్చితార్థం జరిగాక.. సుధీర్ పెళ్లి ఆగిపోయిందా..!
