Ramayana: రామాయణ సెకండ్ ట్రైలర్‌… విమర్శలకు చెక్‌ పడినట్టేనా?

Edited By:

Updated on: Oct 19, 2026 | 7:29 PM

రణబీర్ కపూర్ రాముడిగా, యష్ రావణాసురుడిగా నటిస్తున్న భారీ చిత్రం ‘రామాయణ’ సెకండ్ ట్రైలర్ విడుదలైంది. గ్రాండ్ విజువల్స్, భారీ యాక్షన్ సీన్స్, మెరుగైన వీఎఫ్ఎక్స్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాయి పల్లవి సీతగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ సంగీతం ట్రైలర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రాకింగ్ స్టార్ యష్‌ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఎపిక్ మూవీ ‘రామాయణ’. ఈ సినిమా సెకండ్ ట్రైలర్‌ను గ్రాండ్‌గా రిలీజ్ చేశారు మేకర్స్. మరి ఈ సెకండ్ ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచేసింది. గతంలో వచ్చిన విమర్శలకు చెక్ పెట్టిందా..? ట్రైలర్‌ 2 టాక్ ఎలా ఉంది..? ఈ స్టోరీలో చూద్దాం. రాముడిగా రణబీర్ కపూర్, రావణాసురుడిగా యష్‌ నటిస్తున్న విజువల్ వండర్ ‘రామాయణ: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్’. ఫస్ట్ ట్రైలర్ కి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను దృష్టిలో ఉంచుకొని, వీఎఫ్ఎక్స్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సెకండ్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. భారీ వీఎఫ్ఎక్స్, గ్రాండ్ యాక్షన్ సీన్స్, భారీ సెట్స్‌ ఈ ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచాయి. రాముడిగా రణబీర్‌ను మరింత పవర్‌ఫుల్‌గా ప్రజెంట్ చేశారు. మరోవైపు ప్రపంచాన్ని శాసించే పవర్‌ఫుల్ రావణుడిగా యష్‌ విశ్వరూపం చూపించారు. ‘నా ముందు ప్రతి తల వంగాల్సిందే’ అంటూ యష్‌ చెప్పిన డైలాగ్ తొలి భాగంలో కంటెంట్ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చింది. ఐరావతంపై రావణుడు దండెత్తే సీన్, పుష్పక విమానం, జటాయువు ఎపిసోడ్స్‌లో గ్రాఫిక్స్ క్వాలిటీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. వీటికి తోడు ఆస్కార్ విన్నర్స్ ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆ విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. సీతగా సాయి పల్లవి, హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే నటిస్తున్న ఈ గ్లోబల్‌ మూవీని దంగల్ ఫేమ్ నితీష్ తివారీ తెరకెక్కిస్తున్నారు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ ఎపిక్ మూవీ ఫస్ట్ పార్ట్, నవంబర్ 5న వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలోకి రాబోతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు… తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

Surya kumar Yadav: దుబాయ్‌లో షారుక్ ఖాన్ ఇంటి పక్కనే.. ఇల్లు కొన్న సూర్యకుమార్ యాదవ్

Elon Musk: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం!

భారత్‌కు ట్రంప్‌ భారీ ఊరట.. 100% టారిఫ్‌కు బ్రేక్‌!

చేతి వాచ్‏లోనూ రామమందిరం, శ్రీరాముడి చిత్రాలు.. ధర తెలిస్తే ఫ్యూజుల్ అవుట్

Loading...
Unable to load recommendations.
Follow Us