Rama Prabha: హీరో ఛాన్స్‌ ఇప్పిస్తే వదిలేశాడు.. అతడికి చాలా బలుపు

Updated on: Apr 30, 2026 | 4:35 PM

సీనియర్ నటి రమాప్రభ సుదీర్ఘ సినీ ప్రస్థానం, శరత్ బాబుతో ఆమె వివాహం-విడాకుల ప్రస్తావనలు ఈ కథనంలో ఉన్నాయి. నటుడు సాగర్‌ను తమిళ సీరియల్ కోసం రమాప్రభ సిఫార్సు చేసిన వైనం, సాగర్ వెళ్లలేకపోవడంతో ఆమె హర్ట్ అవ్వడం, మొగలిరేకులు సెట్‌లో వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ, సాగర్ తన వివరణతో ఆమెను కూల్ చేసిన కీలక సంఘటనలను ఈ కథనం వివరిస్తుంది.

ప్రముఖ సీనియర్ నటి రమాప్రభ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన నటనతో ఎన్నో ఏళ్ల పాటు తెలుగు ఆడియన్స్ ను అలరించారామె. కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేసిన ఆమె ఆ తర్వాత సహాయక నటిగా, హాస్య నటిగా మారిపోయారు. సుమారు 1400 కు పైగా సినిమాల్లో అమ్మ , అత్త, బామ్మ పాత్రల్లో నటించి అలరించారు . ఇక శరత్ బాబుతో పెళ్లి, విడాకులు రమాప్రభ జీవితాన్ని మరో మలుపు తిప్పాయని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ సీనియర్ నటి సినిమాలకు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. తన సొంతూరైన చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో ఉంటున్నారు. ఆ మధ్య రమాప్రభ ఆరోగ్యం బాలేదు, దీన స్థితిలో ఉన్నారు అంటూ రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే అందులో నిజం లేదని స్వయంగా రమా ప్రభనే క్లారిటీ ఇచ్చారు. అయితే ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ అయినా సైలెంట్ గా ఉండే రమాప్రభ ఒక టాలీవుడ్ హీరో విషయంలో బాగా హర్టయిందట. అతను మరెవరో కాదు చక్రవాకం, మొగలి రేకులు సీరియల్స్ హీరో సాగర్. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంటోన్న సాగర్ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. అక్కడ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇదే సమయంలో రమా ప్రభ గురించి కూడా చెప్పుకొచ్చాడు. చక్రవాకం సీరియల్ తర్వాత కెరీర్ లో ఎలాంటి స్టెప్ తీసుకోవాలి అనే డైలమాలో పడ్డాను. అదే సమయంలో ఒక తమిళ సీరియల్ లో నటించే అవకాశం వచ్చింది. సీనియర్ నటి రమాప్రభ గారు నన్ను రికమెండ్ చేసి ఆ తమిళ సీరియల్ లో నటించే అవకాశాన్ని ఇప్పించారు. అయితే నేను చెన్నైకి కొత్త. మా యాక్టింగ్ స్కూల్లో నేర్పించిన యాక్టింగ్ ఒకటి.. బయట చేయాల్సింది మాత్రం మరొకటి.. డ్రామా స్కూల్ లో నాకు సహజంగా ఎలా నటించాలి అనే విషయాన్ని మాత్రమే నేర్పించారు. కానీ సీరియల్స్ లో మాత్రం డ్రమాటిక్ గా చేయాలి అనగానే చాలా కష్టం అనిపించింది. అందుకే నేను చెన్నై వెళ్లలేకపోయాను. దీంతో నన్ను రికమెండ్ చేసినా వెళ్లకపోవడంతో రమాప్రభ హర్ట్ అయ్యారు . ఆ తరువాత ఒకరోజు మొగలిరేకులు సీరియల్ స్టార్ట్ అయ్యాక అక్కడికి వెళ్తే.. అదే సెట్లోకి అనుకోకుండా రమాప్రభ కూడా వచ్చారు. ఇక మొగలిరేకులు సీరియల్ టీంతో ఈ అబ్బాయికి చెన్నైలో మంచి ఛాన్స్ ఇప్పిస్తే వెళ్లలేదు ఇతనికి చాలా బలుపు.. హీరోగా నటించే అవకాశం వదులుకున్నాడు అంటూ నాపై ఫైర్ అయ్యారు. ఇక నేను చేసేదేమీ లేక సైలెంట్ గా ఉండి ఇక్కడే సీరియల్స్ చేయాలి అనుకుంటున్నాను అన్న విషయాన్ని ఆమెతో చెప్పాను. దాంతో ఆవిడ కూల్ అయ్యారు’అంటూ సాగర్ చెప్పుకొచ్చాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కావిడి కట్టి.. తల్లిని మోసి.. 3 నెలలు 24 రోజుల పాటు 1,800 కి.మీ నడిచి

అమ్మాయిలని ఇంప్రెస్ చేయబోయి.. చావు దెబ్బలు తిన్న యువకుడు

LPG Gas Cylinder: మే 1 నుంచి గ్యాస్ సిలిండర్ ధరల షాక్ !!

అంతరిక్షం నుంచి భూమిపై మీ పేరును వెతుక్కోండి..

పెళ్లి చేసుకోకుండానే తల్లిని అవుతా.. దివ్య సత్యరాజ్ సంచలన వ్యాఖ్యలు వైరల్

Follow Us