Ram Charan – Klin Kaara: ‘నా కూతురు కోసం పూర్తిగా మారిపోయా..’ చరణ్ ఎమోషనల్ కామెంట్స్..

|

Jun 18, 2024 | 10:57 AM

తండ్రులకు కూతళ్లపై ప్రత్యేక ప్రేమ ఉంటుంది. అప్పుడప్పుడు అది అమ్మ ప్రేమను కూడా డామినేట్ చేస్తుంటుంది. ఇక రామ్ చరణ్‌ క్లీంకార విషయంలోనూ అదే జరుగుతోంది. క్లీంకార మీదున్న ప్రేమ ఏకంగా చరణ్ను మారిపోయేలా.. తన షూటింగ్‌ టైమింగ్‌ను కూడా మార్చుకునేలా చేసింది. ఇక ఎప్పుడూ మీడియా ముందుకు రానీ మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ జూన్ 16 ఫాదర్స్‌ డే సందర్భంగా ఓ నేషన్‌ మీడియాతో ముచ్చటించారు.

తండ్రులకు కూతళ్లపై ప్రత్యేక ప్రేమ ఉంటుంది. అప్పుడప్పుడు అది అమ్మ ప్రేమను కూడా డామినేట్ చేస్తుంటుంది. ఇక రామ్ చరణ్‌ క్లీంకార విషయంలోనూ అదే జరుగుతోంది. క్లీంకార మీదున్న ప్రేమ ఏకంగా చరణ్ను మారిపోయేలా.. తన షూటింగ్‌ టైమింగ్‌ను కూడా మార్చుకునేలా చేసింది. ఇక ఎప్పుడూ మీడియా ముందుకు రానీ మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ జూన్ 16 ఫాదర్స్‌ డే సందర్భంగా ఓ నేషన్‌ మీడియాతో ముచ్చటించారు. అలా ముచ్చటిస్తూనే… క్లీంకారకు తనకు మధ్య ఉన్న అనుబంధం గురించి కాస్త ఎమోషనల్‌గా చెప్పారు. తన మాటలతో నెట్టింట గ్రేట్ అండ్ క్యూట్ ఫాదర్‌ అనే కామెంట్ కూడా వచ్చేలా చేసుకుంటున్నారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ క్లీంకారతో తనకున్న అనుబంధం గురించి ఏం చెప్పారంటే.. “క్లింకార ఇప్పుడిప్పుడే అందర్ని గుర్తుపడుతుంది. నేను ఇంట్లో లేకపోతే నన్ను మిస్ అవుతుంది. ఆమె నా దగ్గర లేకపోయినా నేను కూడా మిస్ అవుతున్నాను.

అసలు తనను వదిలి వెళ్లాలని అనిపించట్లేదు. అందుకే కనీసం తనకు రెండేళ్లు వచ్చేవరకు ఎక్కువ సమయం తనతో గడపాలనుకుంటున్నాను. తను స్కూల్ కు వెళ్లెవరకూ నా టైమింగ్స్ మార్చుకుని నా కూతురితో ఎక్కువ సమయం గడిపేలా ప్లాన్ చేసుకుంటాను. ఇప్పటికే నేను 15 ఏళ్లు కష్టపడ్డాను. ఇప్పుడు మాత్రం డైలీ సాయంత్రం 6వరకు ఇంటికి వచ్చి నా కూతురితో గడుపుతున్నాను. తనను వదిలి షూటింగ్స్ కు వెళ్లడం కష్టంగానే ఉంటుంది. తనను చూడాగానే నా ఫేస్ లో ఒక సంతోషం వస్తుంది. నేను ఇంటి దగ్గరే ఉంటే క్లింకారా కు నేనే తినిపిస్తాను. ఈ విషయంలో మాత్రం నాతో ఎవరు పోటీ పడలేరు. ఇంట్లో అందరూ తనకు తినిపించడానికి కష్టపడుతారు. కానీ నేను తినిపిస్తే మాత్రం మొత్తం తినేస్తుంది. క్లింకారకు రెండుసార్లు ఆహారం నేనే తినిపిస్తాను. తనకు తినిపించడం చాలా ఇష్టం. ” అంటూ తన కూతురుతో తనకున్న బాండింగ్ గురించి ఎమోషనల్‌గా చెప్పుకొచ్చారు మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్‌.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.