Ram Charan: పెద్ది సినిమా ఏమో కానీ.. నా కూతురిని ఎత్తుకోలేకపోతున్నా

Updated on: May 22, 2026 | 3:48 PM

‘పెద్ది’ సినిమా కోసం రామ్ చరణ్ తీవ్రంగా శ్రమించారని తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. క్రికెటర్, పహిల్వాన్, రన్నర్‌లా మూడు భిన్నమైన షేడ్స్‌లో కనిపించేందుకు తన బాడీని పూర్తిగా మార్చుకున్నానని తెలిపారు. షూటింగ్ సమయంలో వచ్చిన నొప్పుల వల్ల ఇప్పుడు తన కూతురు క్లిన్ కారాను కూడా ఎత్తుకోలేకపోతున్నానంటూ చరణ్ భావోద్వేగానికి గురయ్యారు.

తను చేసే ప్రతీ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి.. బాడీ అండ్ సోల్ పెట్టి మరీ సినిమాల కోసం కష్టపడే అలవాటున్న చరణ్.. పెద్ది కోసం కూడా విపరీతంగా కష్టపడ్డాడు. క్రాస్ ఓవర్ అథ్లెట్‌ పెద్ది సినిమాలో నటించాడు. క్రికెటర్‌గా.. పహిల్వాన్‌గా.. రన్నర్‌గా 3 డిఫరెంట్ షేడ్స్లో కనిపించాడు.అందుకోసం తన బాడీని అన్‌ కండీషనల్‌గా మౌల్డ్ చేసుకున్నాడు. ఓ పక్క ఒళ్లు హూనం అవుతున్నా.. గాయాలపాలవుతున్నా… లెక్క చేయకుండా బుచ్చిబాబు విజన్‌ను మ్యాచ్ చేశాడు. జూన్ 4న సిల్వర్ స్క్రీన్ మీదికి వస్తున్నాడు. ఈక్రమంలోనే పెద్ది ప్రమోషనల్‌ ఇంటర్వ్యూలో.. పెద్ది సినిమా వల్ల తన కూతురిని ఎత్తుకోలేకపోయా అంటూ ఎమోషనల్ అయ్యాడు చరణ్. పెద్ది షూటింగ్ సమయంలో ఏదో ఆవేశంలో నొప్పులు తెలియలేదని.. కానీ ఇప్పుడు ఒళ్లంతా నొప్పులుగా ఉందంటూ ఇంటర్వ్యూలో భాగంగా బుచ్చిబాబు కు చెప్పాడు చరణ్‌. అంతేకాదు ఈ నొప్పుల వల్ల.. కనీసం తన కూతురు క్లిన్ కారాను కూడా ఎత్తుకోలేకపోతున్నా అంటూ చరణ్ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం చరణ్ చేసిన ఈ ఎమోషనల్‌ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాదు పెద్ది సినిమా కోసం చరణ్ పడ్డ కష్టాన్ని అందరికీ తెలిసేలా చేస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కోట్లు ఇచ్చినా రాని ఆనందం.. రైతన్నను మురిపించిన నేల తల్లి

సీఎం సార్.. నన్ను అమ్మేశారు.. కాపాడండి ప్లీజ్‌

Follow Us