Rajinikanth: సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?

Updated on: Jun 10, 2026 | 12:21 PM

తమిళనాడులో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పిన రజినీకాంత్ మళ్లీ రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నారనే ప్రచారం ఊపందుకుంది. ‘మక్కల్ మడై’ అనే సామాజిక వేదికను రాజకీయ పార్టీగా మార్చే అవకాశాలపై చర్చ జరుగుతోంది. మాజీ బీజేపీ నేత అన్నామలైతో రజినీకాంత్ భేటీ కావడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది.

అరవ రాజకీయాలు మరింత ఆసక్తిగా మారుతున్నాయి. నిన్నటి దాకా రాజకీయాలపై ఆసక్తి లేదన్న రజినీ కాంత్.. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేందుకు ట్రై చేస్తున్నారా? అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమిళ నాడు మాజీ బీజేపీ నేత అన్నామలై మద్దతుతో రజినీ పార్టీ పెడుతున్నాడనే వార్త తమిళానాట గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే అన్నామలై … రజినీకాంత్ భేటీ అయ్యారు. గత మార్చ్ లో రజినీకాంత్ భార్య లత.. తాము చేయబోయే సేవా సంస్థల గురించి ప్రకటిస్తూ ‘మక్కల్ మడై’ అనే ఓ వేదికని ప్రకటించారు. ప్రజల సమస్యలు వినడానికి, మహిళలు, పిల్లలు, వెనకబడ్డ వర్గాల కోసం పోరాటం చేయడానికి ఈ మక్కల్ మడై ముందుంటుందని ఆమె ప్రకటించారు.అయితే అసెంబ్లీ ఎన్నికల హడావిడిలో ఈ సంస్థని ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు అదే మక్కల్ మడై పార్టీగా మారబోతుందని అంటున్నారు. ఇక గతంలో రజినీకాంత్ ‘రజిని మక్కల్ మడై’ అనే పేరుతోనే పార్టీ పెడదాం అనుకున్నారు. ఇప్పుడు అదే పేరుతో స్వచ్ఛంద సంస్థని ఏర్పాటు చేసారు. ఈ క్రమంలోనే అన్నామలై రజినీకాంత్ కలుస్తారని, ఈ మక్కల్ మడై ని పార్టీగా మార్చి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని తమిళ మీడియా కోడై కూస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!

రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ప్రకృతి సృష్టించిన ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే

ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. ఇంకా మిస్టరీగానే మిస్సింగ్‌ కేసు..

Katrina Kaif: కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.

జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో

Follow Us