Rajendra Prasad: తమిళ నటుడు MGR పై నటుడు రాజేంద్ర ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు
రాజేంద్ర ప్రసాద్ ఇటీవల హైదరాబాద్‌లో కాంతారావు జాతీయ పురస్కార సన్మాన సభలో తమిళ దిగ్గజ నటుడు ఎంజీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాంతారావు గొప్పదనం గురించి చెబుతూ, ఎంజీఆర్ భయంతో పోసుకునేవారంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేయడంతో తమిళ అభిమానులు, రాజకీయ నాయకుల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారానికి దారి తీశాయి.
సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కాంతారావు జాతీయ పురస్కార సన్మాన సభలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆయన తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో, ఈసారి తమిళుల ఆరాధ్య దైవం, మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. లెజెండరీ నటుడు కాంతారావు గొప్పదనం గురించి వివరిస్తూ, రాజేంద్ర ప్రసాద్ ఒక్కసారిగా గీత దాటారు. జానపద చిత్రాల్లో కాంతారావు కత్తి సాము, నటన చూసి తమిళ గ్రేటెస్ట్ హీరో ఎంజీఆర్ భయంతో పోసుకునేవారని షాకింగ్ కామెంట్స్ చేశారు. కాంతారావు జానపద చిత్రాలను చూసి ఎంజీఆర్ “ఇండియన్ సినిమాను మొత్తం లేపుకెళ్లిపోతున్నాడ”ని భావించి “ఉచ్చ పోశారు” అంటూ ఆయన పునరుద్ఘాటించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గల్ఫ్ దేశాలపై కొనసాగుతున్న ఇరాన్ దాడులు
ఖర్గ్ ఐలాండ్ ను పేల్చేసి ఇరాన్ ను దెబ్బతీసే ఆలోచనలో ట్రంప్
T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్ విజేతలకు రూ.131 కోట్ల నజరానా
Gas Crisis: దేశవ్యాప్తంగా వంట గ్యాస్ టెన్షన్.. అష్ట కష్టాలు పడుతున్న ప్రజలు