Rahul Ravindran: పిల్లలను చంపేస్తామనే బెదిరింపులు.. ‘ఎక్స్‌’ నుంచి తప్పుకున్న డైరెక్టర్

Updated on: Jul 04, 2026 | 9:08 PM

సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు, వ్యక్తిగత దాడులు ఎదుర్కొన్న దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఎక్స్ వేదికను వీడుతున్నట్లు ప్రకటించారు. తన పిల్లలను చంపేస్తామని బెదిరిస్తూ వచ్చిన కామెంట్ తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. ఆన్‌లైన్ ద్వేష ప్రచారం, సైబర్ వేధింపులపై మరోసారి చర్చకు దారితీసిన ఈ ఘటన నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

సోషల్ మీడియాలో రోజు రోజుకూ నెగెటివిటీ పెరిగిపోతోంది. కొందరు నెటిజన్లు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ పెట్టే పోస్టులు.. వారిలో తెలియని భయాన్ని, అశాంతిని పుట్టిస్తున్నాయి. స్టార్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ కు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఇటీవల పూణెలో హత్యకు గురైన కేతన్‌ అగర్వాల్‌ కేసు చుట్టూ సోషల్‌ మీడియాలో పెద్ద చర్చ సాగుతోంది. ఓ నెటిజన్‌ రాహుల్‌ను ట్యాగ్‌ చేస్తూ మహిళల సమస్యలపై సినిమా తీసినట్లే పురుషులపై జరుగుతున్న అన్యాయాలపై కూడా తీస్తారా? అని ప్రశ్నించాడు. దీనికి స్పందించిన రాహుల్‌ సమాజంలో ఇప్పటికీ పితృస్వామ్య భావజాలం బలంగానే ఉందని అభిప్రాయపడ్డాడు. ఆ వ్యాఖ్యల తర్వాత సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. కొందరు అతన్ని దూషించడమే కాకుండా, ఆయన సతీమణి చిన్మయిపై కూడా వ్యక్తిగత దాడులకు దిగడం ప్రారంభించారు. ఈక్రమంలోనే ఓ నెటిజన్‌ రాహుల్ పిల్లలను చంపేస్తానంటూ బెదిరిస్తూ కామెంట్ పెట్టాడు. ఈ కామెంట్‌ను చదివిన రాహుల్ తీవ్ర ఆగ్రహానికి అశాంతికి లోనయ్యాడు. తనలో తాను కాసేపు అంతర్మథనం పడిన ఆయన ఇక తాను ఎక్స్‌లో ఉండలేనంటూ.. ఎక్స్‌ నుంచి క్విట్ అయ్యాడు. ఇదే విషయాన్ని తనే స్వయంగా పోస్ట్‌ చేయడంతో.. ఇప్పుడీ టాపిక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జడ్చర్లలో వింత కాకి ప్రత్యక్షం.. అపశకునం అంటున్న స్థానికులు!

సమానత్వానికి సరికొత్త పాఠం.. విద్యార్ధులతోపాటు యూనిఫాంలో ఉపాధ్యాయులు

దుకాణాల్లో కొన్న పచ్చళ్లను లొట్టలేసుకుంటూ తింటున్నారా? ఈ వీడియో చూస్తే.. వాటి జోలికి పోరు!

పదవీ విరమణకు ముందు రోజు పర్మినెంట్ ఉద్యోగం.. టీచర్‌కు వింత అనుభవం

మానవత్వం చాటుకున్న టీచర్‌ విద్యార్ధిని వీపుపై మోస్తూ 6 కి.మీ.

Published on: Jul 04, 2026 09:08 PM
Loading...
Unable to load recommendations.
Follow Us