Prabhas: నేను పెళ్లి చేసుకోవాలా.? వద్దా.? ఆయన వల్లే పెళ్లి చేసుకోలేదా.?

|

Nov 12, 2024 | 9:47 AM

సలార్ సినిమాతో దాదాపు ఆరేళ్ళ తర్వాత సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన ప్రభాస్.. ఆ వెంటనే కల్కి సినిమాతో భారీ హిట్ అందుకున్నారు. కల్కి దెబ్బకు బాక్సాఫీస్ షేక్ అయ్యింది. ఏకంగా ఈ సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూల్ చేసింది. ఇక ఇప్పుడు రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ప్రభాస్. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ప్రస్తుతం ప్రభాస్ సినిమాల షూటింగ్స్ లో తెగ బిజీగా మారిపోయాడు. అయితే ప్రభాస్ పెళ్లి గురించి ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. ఓ స్టార్ హీరోయిన్ ను ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడు అని అప్పట్లో గాసిప్స్ వచ్చాయి. అలాగే భీమవరం అమ్మాయి అని, రాజకీయనాయకుడు మనవరాలు అంటూ ఏవేవో వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా ప్రభాస్ పెళ్లి గురించి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

ప్రభాస్ ప్రముఖ గేయ రచయిత దివంగత సిరివెన్నెల సీతారామ శాస్త్రిగారి జ్ఞాపకంగా నిర్వహిస్తున్న నా ఉచ్ఛ్వాసం కవనం అనే కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రభాస్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘జల్సా’లోని చలోరే చలోరే చల్‌ పాట గురించి మాట్లాడారు. ఆ పాట అంటే తనకు చాలా చాలా ఇష్టమని అన్నారు ప్రభాస్. ఏ పార్టీకి వెళ్లినా ఈ పాట గురించే మాట్లాడుకుంటాం.. నేను ఈ పాట గురించి మాట్లాడితే ఫ్రెండ్స్ పారిపోయేవారు అని అన్నారు ప్రభాస్. ఈ క్రమంలోనే ప్రభాస్ తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మనీ అనే సినిమాలో ‘భద్రం బీకేర్‌ఫుల్‌ బ్రదర్‌’ పాట సీతారామశాస్త్రి రాశారా..! అందులో పెళ్లి చేసుకోవద్దని రాశారు. పెళ్లి డేంజర్ అని రాశారు. తర్వాత సినిమాల్లో పెళ్లి గురించి గొప్పగా ఎన్నో పాటలు రాశారు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలా.. ? చేసుకోకూడదా.? అని నవ్వుతూ అన్నారు ప్రభాస్. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.