Ustaad Bhagat Singh: నార్త్‌ అమెరికాలో ఉస్తాద్‌కు.. షాకిచ్చేలా.. కలెక్షన్స్‌

Updated on: Mar 29, 2026 | 3:09 PM

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఉగాది కానుకగా విడుదలై ప్రపంచవ్యాప్తంగా ₹68.06 కోట్లు వసూలు చేసి విజయవంతమైంది. పవన్ కళ్యాణ్ హీరోగా, హరీశ్‌ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ రాబట్టినా, నార్త్ అమెరికాలో మాత్రం $1 మిలియన్ మార్కును కూడా చేరుకోలేకపోయింది. కేవలం ₹6 కోట్లు మాత్రమే రాబట్టి, ట్రేడ్ నిపుణులను షాక్‌కు గురిచేసింది. అయితే, 'కాలర్ ఎత్తరా' వంటి పాటలు యూట్యూబ్‌లో దూసుకుపోతున్నాయి.

పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ హీరోగా.. హరీశ్‌ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ.. ఎన్నో అంచనాల మధ్య.. ఉగాది కానుకగా రిలీజ్ అయింది. తెలుగు టూ స్టేట్స్‌లో మంచి వసూళ్లను సాధించింది. వరల్డ్ వైడ్ దాదాపు 68.06 కోట్లు సాధించింది. అయితే నార్త్‌ అమెరికాలో మాత్రం ఉస్తాద్‌కు ఒక మిలియన్‌ డాలర్లు కలెక్షన్స్‌ మాత్రమే రావడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఫిల్మ్ ట్రేడ్ నిపుణుల రిపోర్డ్ ప్రకారం.. నార్త్ అమెరికాలో ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ ఇప్పటి వరకు రూ. 6 కోట్లు మాత్రమే రాబట్టిందట. అక్కడ ఉస్తాద్‌ లాభాల్లోకి రావాలంటే కనీసం మరో రూ. 7 కోట్లు రాబట్టాలి. ఇప్పటి వరకు ఈ సినిమా 1 మిలియన్ డాలర్ల మార్కును కూడా అక్కడ అందుకోకపోవడంతో ట్రేడ్ నిపుణులే షాకవుతున్నారని న్యూస్. ఇక ఈ విషయం పక్కకు పెడితే.. ఉస్తాద్ సినిమా సాంగ్స్ ఇప్పటికీ యూట్యూబ్‌లో దిమ్మతిరిగే రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి. కాలర్ ఎత్తరా సాంగ్ ఇప్పటికీ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

యాక్టింగ్ నేర్పించి, సినిమా ఛాన్స్ ఇస్తే.. నా పైనే నిందలా..!

రిషబ్ Vs రుక్మిణి.. తెర వెనుక ఏదో జరుగుతోందబ్బా…?

తెలంగాణ వాహనదారులకు గుడ్ న్యూస్.. DL, RC కార్డులు ఇక నేరుగా మీ ఇంటికి

Hey Balwanth: OTTలోకి వస్తున్న సుహాస్ న్యూ ఫిల్మ్

ట్రంప్‌ సంచలన నిర్ణయం.. అమెరికా కరెన్సీపై ట్రంప్‌ సంతకం

Follow Us