ట్రెండ్ సెట్ చేస్తున్న టాప్ బ్యూటీస్

Edited By:

Updated on: Jul 19, 2026 | 10:40 AM

పాన్ ఇండియా సినిమాల ప్రభావంతో స్టార్ హీరోయిన్ల ఆలోచనా విధానం మారుతోంది. కథకు ప్రాధాన్యం ఉంటే నెగెటివ్, సపోర్టింగ్ పాత్రల్లో నటించేందుకు కూడా రష్మిక మందన్న, రుక్మిణి వసంత్, నయనతార, కాజల్, త్రిష, తమన్నా వంటి హీరోయిన్లు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఇండియన్ సినిమాలో హీరోయిన్ పాత్రకు కొత్త నిర్వచనం ఏర్పడుతోంది.

పాన్ ఇండియా ట్రెండ్ హీరోయిన్ల థాట్ ప్రాసెస్ మార్చేస్తుంది. ఒకప్పుడు ఫామ్‌లో ఉన్న హీరోయిన్స్‌ లీడ్ రోల్స్‌లో తప్ప సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసేందుకు నో అనే వారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి రిస్ట్రిక్షన్స్‌ ఏం పెట్టుకోవటం లేదు బ్యూటీస్‌. సినిమా రేంజ్‌ను బట్టి, నెగెటివ్‌, సపోర్టింగ్ రోల్స్‌కు కూడా రెడీ అవుతున్నారు. ఇలా నయా ట్రెండ్ సెట్ చేస్తున్న హీరోయిన్స్‌ లిస్ట్‌లో టాప్‌ బ్యూటీస్‌ కూడా ఉన్నారు. ప్రజెంట్ నేషనల్ లెవల్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న బ్యూటీ రష్మిక మందన్నా. హీరో సెంట్రిక్ సినిమాలతో పాటు లేడీ ఓరియంటెడ్ మూవీస్‌తోనూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ అవసరమైతే సపోర్టింగ్ రోల్స్‌కూ సై అంటున్నారు. ఆ మధ్య సీతారామం మూవీలో కథను నడిపించే కీలక పాత్రలో కనిపించిన రష్మిక.. ఇప్పుడు రాకా సినిమాలో విలన్‌గా నటిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. కాంతార ఛాప్టర్1 మూవీతో పాన్ ఇండియా హిట్ అందుకున్న రుక్మిణీ వసంత్ కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. డ్రాగన్‌ లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్‌లో హీరోయిన్‌గా నటిస్తూనే టాక్సిక్‌, ధర్మన్ లాంటి సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్‌కు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. మరో వైపు సీనియర్ హీరోయిన్స్ అంతా నెమ్మదిగా సైడ్ క్యారెక్టర్లకు షిఫ్ట్ అవుతున్నారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తూనే సపోర్టింగ్ రోల్స్‌లోనూ కనిపిస్తున్నారు. కాజల్‌, త్రిష, తమన్నా లాంటి బ్యూటీస్‌ కథలో కీలకపాత్రలో నటించేందుకు ఓకే చెబుతున్నారు. దీంతో పాన్ ఇండియా ట్రెండ్‌లో హీరోయిన్ అన్న పదానికి డెఫినియేషన్ మారిపోతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టాలీవుడ్ మీద ఫోకస్ చేస్తున్న తమిళ హీరోలు

తెర వెనుక డ్యాన్సర్ల కన్నీళ్లు.. కమిషన్ల దందా! జానీ మాస్టర్‌ది మొండిపట్టేనా?

ఉత్తమ పాపులర్ చిత్రం గా ‘కల్కి 2898 AD

 

Published on: Jul 19, 2026 10:38 AM
Follow Us