OG ఎఫెక్ట్.. సుజీత్‌కు షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజి' సినిమా అభిమానులకు కేవలం చిత్రం కాదు, ఓ ఎమోషన్. ఈ చిత్రం రూ.300 కోట్లు వసూలు చేసి అంచనాలను మించి విజయం సాధించింది. ఈ అద్భుతమైన విజయాన్ని అందించిన దర్శకుడు సుజీత్‌కు పవన్ కళ్యాణ్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును బహుమతిగా ఇచ్చారు. భవిష్యత్తులో ఈ కాంబినేషన్ మళ్లీ తెరపైకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి అనేది కేవలం సినిమా మాత్రమే కాదు.. ఓ ఎమోషన్ కూడా. థియేటర్లలో ఉన్నన్ని రోజులు దాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు ఫ్యాన్స్. అయిపోయాక కూడా అలాంటి సినిమా ఇచ్చినందుకు ఆ దర్శకుడికి థ్యాంక్స్ చెప్తూనే ఉన్నారు. మరి ఫ్యాన్సే అలా ఉన్నపుడు హీరో ఊరికే ఉంటాడా..? అందుకే పవన్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. అదేంటో చూద్దాం పదండి.. 12 ఏళ్లుగా సరైన సినిమా కోసం వేచి చూస్తూనే ఉన్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. పుష్కర కాలంగా ఎన్ని సినిమాలు చేసినా ఫలితం మాత్రం ఆశించినట్లు రాలేదు. మధ్యలో భీమ్లా నాయక్, వకీల్ సాబ్ సోసోగానే ఆడాయి కానీ ఆకలి మాత్రం తీర్చలేదు. అలాంటి సమయంలో వచ్చింది ఓజి.. పవన్ ఫ్యాన్స్ ఆకలి తీర్చడానికి..! 300 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం. ముందు నుంచే ఓజిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. వాటిని నిలబెడుతూ అభిమానులు కోరుకున్న దానికంటే పదిరెట్లు ఎక్కువగానే పవన్‌ను ప్రజెంట్ చేసారు డైరెక్టర్ సుజీత్. అందుకే ఆయనకు గుడి కట్టినా తప్పులేదు అంటూ మునగచెట్టెక్కించారు ఫ్యాన్స్. తాజాగా తనకు అలాంటి సినిమాను ఇచ్చిన సుజీత్‌కు ల్యాండ్ రోవర్ డిఫెండర్ గిఫ్ట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. పవన్ ఇచ్చిన కారుతో ఖతర్నాక్ ఫోజులిచ్చారు సుజీత్. త్వరలోనే ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. ఓజి ప్రీక్వెల్, సీక్వెల్ చేస్తానని ఇప్పటికే చెప్పారు పవన్. ఈలోపు నానితో సినిమా చేస్తున్నారు సుజీత్. ఈ గ్యాప్‌లో పవన్ కూడా ఉస్తాద్ భగత్ సింగ్‌పై ఫోకస్ చేసారు. అన్నీ కుదిర్తే త్వరలోనే ఓజి కాంబో మళ్లీ సెట్స్‌పైకి రానుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Demon Pavan: అప్పుడు ఇజ్జత్ పోగొట్టుకున్నాడు.. ఇప్పుడు హీరోలా నిలబడ్డాడు
Bharani: గెలవకున్నా పర్లేదు.. ఆ రేంజ్‌లో రెమ్యునరేషన్ దక్కించున్న భరణి
నటిని కిడ్నాప్ చేసిన ఆమె భర్త !! కట్ చేస్తే ??
Emanuel: ఇమ్మాన్యుయేల్ గెలవడం కష్టమేనా ??
కొత్త సినిమా ప్రకటించిన కొద్ది రోజులకే..దర్శకుడి కొడుకు లిఫ్ట్ ప్రమాదంలో మృతి