OG 2: OG 2 నుంచి ఆయన ఔట్.. రేసులో ఉన్నది వాళ్లే..!

Edited By:

Updated on: Jun 22, 2026 | 9:25 PM

పవన్ కళ్యాణ్-సుజీత్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న OG 2పై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ సీక్వెల్‌ నుంచి నిర్మాత డీవీవీ దానయ్య తప్పుకున్నారనే వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్‌తో పాటు మరో అగ్ర నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కానుందని ప్రచారం జరుగుతోంది. మైత్రి మూవీ మేకర్స్, యువీ క్రియేషన్స్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

ఇక OG 2 సినిమాపై ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు.. ఇప్పుడు కాకపోతే మరో ఆర్నెళ్ళ తర్వాతైనా ఈ సినిమా కచ్చితంగా ఉంటుంది. అయితే ఇప్పుడది కాదు మ్యాటర్.. ఈ సినిమాకు నిర్మాత మారిపోయారా..? ఓజిని నిర్మించిన దానయ్య సీక్వెల్‌లో భాగం కావట్లేదా..? ఒకవేళ అదే నిజమైతే.. పవన్ సినిమా సీక్వెల్ ఎవరి చేతుల్లోకి వెళ్లింది..? సుజీత్ ఎవరి వైపు అడుగులేస్తున్నారు..? ఏ ముహూర్తానా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ OG 2 ఉంటుందని.. సుజీత్ ఇండియాకు వచ్చాక మరిన్ని అప్‌డేట్స్ చెప్తామని ట్వీట్ చేసారో గానీ.. అప్పట్నుంచి సినిమాపై బజ్ అస్సలు ఆగట్లేదు. తాజాగా OG 2 గురించి మరో సెన్సేషనల్ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి నిర్మాత దానయ్య తప్పుకున్నారు.. మరో కొత్త నిర్మాణ సంస్ధ చేతుల్లోకి OG 2 వెళ్లనుంది. నిజానికి ఓజితో పాటు సీక్వెల్ కూడా దానయ్యే చేస్తారని అనుకున్నారంతా. దానికంటే ముందే నాని సినిమాను కూడా ఇదే బ్యానర్‌లో సుజీత్ చేయాల్సి ఉంది. అప్పట్లో అనౌన్స్‌మెంట్ వీడియో కూడా వచ్చింది. అయితే ఓజి విడుదలయ్యాక ఏం జరిగిందో ఏమో కానీ.. ఆ సినిమాను దానయ్య కాకుండా నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. అదే సమయంలో ఓజి 2 సినిమా నుంచి సైతం దానయ్య తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాను పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నిర్మించబోతుంది.. అయితే సోలోగా మాత్రం కాదు.. పవన్‌తో పాటు మరో అగ్ర నిర్మాణ సంస్థ కూడా ఓజి 2లో భాగం కాబోతుంది. అదెవరూ అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి మైత్రి మూవీ మేకర్స్, యువీ క్రియేషన్స్ ఈ రేసులో ముందున్నాయని తెలుస్తుంది. ప్యారడైజ్ అయిపోయాక.. బ్లడీ రోమియోపై ఫోకస్ చేయనున్నారు నాని. మరోవైపు సుజీత్ కూడా ఈ సినిమా బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసి.. ప్రస్తుతం హంగేరీ, లండన్‌లో లొకేషన్స్ వేటలో ఉన్నారు. ఇండియా రాగానే నాని మూవీ పట్టాలెక్కనుంది. ఆ తర్వాత అన్నీ అనుకున్నట్లు జరిగితే ఓజి 2 మొదలవ్వడానికి పెద్ద సమయం పట్టకపోవచ్చు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

11 ఏళ్లకే యూకే యూత్ పార్లమెంట్ సభ్యురాలిగా రికార్డ్‌.. వైజాగ్ టు లండన్ కలశ నాయుడు ప్రయాణం

ఉద్యోగితో రూ. 2.5 లక్షల ఫిట్‌నెస్ బెట్ లో ఓడిన జెరోదా బాస్

ఫోన్‌ దొంగిలించి పారిపోతూ కుప్పకూలిన దొంగ.. క్షణాల్లో ప్రాణాలు గాల్లో..

వీడు మామూలోడు కాదు.. పగలు ఇళ్లకు రంగులు.. రాత్రయితే చాలు..

అంతరిక్షంలో వింత.. ‘ఆ గ్రహం’ పై ఉప్పు వర్షం..

Published on: Jun 22, 2026 09:13 PM
Follow Us