OG 2: అజ్ఞాతవాసి తర్వాత OG2 కోసమే పవన్ అలా..!

Edited By:

Updated on: Jun 27, 2026 | 5:52 PM

‘ఓజి 2’పై అధికారిక ప్రకటన రావడంతో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సీక్వెల్ కోసం పవన్ ఏకంగా 70 రోజుల కాల్షీట్లు కేటాయించనున్నట్లు సమాచారం. దర్శకుడు సుజీత్‌కు గత చిత్రంతో పోలిస్తే అధిక పారితోషికం అందనున్నట్లు టాక్. దీంతో నాని ‘బ్లడీ రోమియో’ ప్రాజెక్ట్ ఆలస్యమయ్యే అవకాశముందన్న ప్రచారం కూడా సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

OG 2 ఎలా ఉండబోతుంది..? ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్‌ను సుజీత్ ఎలా మార్చబోతున్నారు..? సీక్వెల్‌లో ప్రీక్వెల్ కథ చెప్తున్నారా లేదంటే ఓజి బ్యాక్ స్టోరీ ఏదైనా ఉందా..? అసలు ఈ చిత్రం కోసం పవన్ డేట్స్ ఎన్నాళ్లు ఇవ్వబోతున్నారు..? ఒకవేళ సుజీత్ ఇక్కడ స్టక్ అయిపోతే.. నాని బ్లడీ రోమియో పరిస్థితేంటి..? ఓజి 2 కోసం సుజీత్‌కు పవన్ పెట్టిన కండీషన్స్ ఏంటి..? ది మోస్ట్ అవైటెడ్ ఓజి 2 సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వీడియో వచ్చేసింది. కొన్ని రోజులుగా రాజకీయాలతో బిజీగా ఉన్నా కూడా.. రెగ్యులర్‌గా సుజీత్‌తో టచ్‌లోనే ఉన్నారు పవన్. అనుకున్నట్లుగానే ఈ సినిమాను ప్రకటించేసారు. ఓజి 2ను పవన్ కళ్యాణ్ సోలోగా నిర్మించబోతున్నారు. షూట్ కూడా మొదలవ్వకుండానే ఓజి 2కి భారీ ఓటిటి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. ఓజి సినిమా కోసం సుజీత్ పడిన తపన.. తనకు ఇచ్చిన ఫ్రీడమ్ పవన్‌కు బాగా నచ్చేసింది. అందుకే ఈ క్రేజీ సీక్వెల్ కోసం ఓజి కంటే సుజీత్‌కు డబుల్ రెమ్యునరేషన్ పవన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది. అంతేకాదు ఓజి 2కు ఎవరూ ఊహించని విధంగా 70 రోజులు ఇవ్వనున్నారు పవన్. 2018 తర్వాత ఏ సినిమాకు 50 రోజులకు మించి ఇవ్వని పవన్.. ఓజి 2కి 70 రోజులు ఇస్తుండటం సంచలనమే. అజ్ఞాతవాసి కోసం అప్పట్లో 55 రోజుల వరకు డేట్స్ ఇచ్చారు పవన్.. ఆ తర్వాత ఆయన సినిమాలన్నీ 30 నుంచి 40 రోజుల్లోపే పూర్తయ్యాయి. బ్రో సినిమా అయితే కేవలం 21 రోజుల్లోనే పవన్ పార్ట్ పూర్తి చేసారు సముద్రఖని. అలాగే ఓజి సినిమాకు పవన్ ఇచ్చింది 37 రోజులే. కానీ ఓజి 2 కాన్సెప్ట్ నచ్చి 70 రోజులు ఇస్తున్నారు పవన్. వేరే సినిమాలు చేసినా.. తను పిలిచినపుడు అందుబాటులో ఉండాలనేది సుజీత్‌కు పవన్ పెట్టిన కండీషన్. ఈ లెక్కన నానితో బ్లడీ రోమియో ఇప్పట్లో లేనట్లే. ఓజస్ గంభీర ఎవరనేది పార్ట్ 2లో పరిచయం చేస్తామన్నారు ఈ దర్శకుడు. హీరో పెంపుడు జంతువును, కామిక్ బుక్ ద్వారా సుభాష్ చంద్రబోస్‌తో పరిచయాన్ని వీడియోలో చూపించారు. అన్నీ కుదిర్తే 2027 సెకండాఫ్‌లో ఓజి 2 రావడం ఖాయం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాస్‌పోర్ట్‌కి అప్లై చేయాలా? త్వరపడండి.. జులై 1 నుంచి ఫీజులు పెరుగుతున్నాయ్‌!

తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలెర్ట్ 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు, పిడుగులు

Rashmika Mandanna: ట్రోలింగ్ భయంతో.. నోరు విప్పలేకపోతున్నా.. రష్మిక ఎమోషనల్

రూ.20 కడితే.. రూ.2 లక్షల బీమా.. అయినా ఎందుకింత నిర్లక్ష్యం?

ఖర్జూరం ప్రియులు తస్మాత్ జాగ్రత్త! గడువు ముగిస్తే.. ముప్పు తప్పదు!

Loading...
Unable to load recommendations.
Follow Us