NTR సినిమాపై కావాలనే రూమర్స్ క్రియేట్ చేస్తున్నారా..?
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్‌పై వస్తున్న వదంతులు అవాస్తవమని నిర్మాతలు స్పష్టం చేశారు. హీరో లుక్, షెడ్యూల్ రద్దుపై వచ్చిన వార్తలను ఖండించారు. ఇది కేవలం షెడ్యూల్స్ మధ్య ప్రిపరేషన్ గ్యాప్ మాత్రమేనని, షూటింగ్ సజావుగా సాగుతోందని తెలిపారు. 'డ్రాగన్' పేరుతో రూపొందుతున్న ఈ అంతర్జాతీయ డ్రగ్ మాఫియా కథాంశంలో ఎన్టీఆర్ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తారని మేకర్స్ హింట్ ఇచ్చారు.
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ ఆగిపోయిందా.. హీరో లుక్ నచ్చలేదని షెడ్యూల్ క్యాన్సిల్ చేసారా..? సోషల్ మీడియాలో వస్తున్న ఈ రూమర్స్ మీద నిర్మాతలు ఏమంటున్నారు..? నిజంగానే షెడ్యూల్ ఆగిపోయిందా.. ఒకవేళ అది అబద్ధమైతే ఇప్పుడు షూటింగ్ ఎందుకు జరగట్లేదు..? అసలు ఏం జరుగుతుంది నీల్, తారక్ సినిమా విషయంలో.. చూద్దాం పదండి డీటైల్డ్‌గా..!ఎన్టీఆర్, నీల్ సినిమా షూటింగ్‌పై కొన్నాళ్లుగా రూమర్స్ నడుస్తూనే ఉన్నాయి. లుక్ విషయంలో హీరో, డైరెక్టర్ మధ్య విభేదాలు వచ్చాయని.. అందుకే షెడ్యూల్ క్యాన్సిల్ అయిందంటూ రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. అయితే ఇవన్నీ అబద్ధమని.. కేవలం షెడ్యూల్స్‌కు మధ్య తీసుకున్న చిన్న ప్రిపరేషన్ గ్యాప్ మాత్రమేనని నిర్మాణ సంస్థ ఫ్యాన్స్‌కు ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. ఎలాంటి అవాంతరాలు లేకుండా ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ చాలా సాఫీగా సాగుతోందని మేకర్స్ స్పష్టం చేస్తూ రూమర్స్‌కు ఫుల్ స్టాప్ పెట్టారు. అనవసరమైన వార్తలను అస్సలు నమ్మొద్దని అభిమానులకు సూచిస్తూనే.. నీల్ మార్క్ ఎలివేషన్స్‌తో ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోందని గట్టిగానే హింట్ ఇచ్చేశారు. కేజీఎఫ్, సలార్ లాంటి సెన్సేషనల్ హిట్స్ తర్వాత ఈసారి ఏకంగా ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా బ్యాక్ డ్రాప్‌తో అదిరిపోయే యాక్షన్ ప్లాన్ చేస్తున్నారు ప్రశాంత్ నీల్. ఈ పవర్ ఫుల్ స్టోరీకి డ్రాగన్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.. ఈ సినిమాలో తారక్‌ను తన గత సినిమాలకు భిన్నంగా చాలా స్టైలిష్‌గా ప్రజెంట్ చేయబోతున్నారు నీల్. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. నెక్ట్స్ షెడ్యూల్‌లో ఈమె కూడా జాయిన్ అయ్యే అవకాశాలున్నాయి. మొత్తానికి ప్రశాంత్ నీల్, తారక్ సినిమా విషయంలో వస్తున్న వార్తలన్నీ రూమర్సే అని మేకర్సే చెప్పడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు అభిమానులు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Peddi: పెద్దిపై మరో పిడుగు.. రామ్ చరణ్ ఏం చేస్తారో..?
Anna Lezhneva: ఒకరికి బర్త్‌డే.. మరొకరికి పునర్జన్మ.. పవన్ భార్య ఎమోషనల్ పోస్ట్
Raaka: క్రూరుడు.. కత్తిలాంటి కుర్రాడు.. బన్నీ డ్యుయల్ రోల్