సోలో డేట్ ఉంది.. కానీ రిలీజ్ చేయడానికి సినిమాలే లేవుగా..!
జూన్ 26న థియేటర్లలో ఒక్క కొత్త క్రేజీ తెలుగు సినిమా కూడా విడుదల కావడం లేదు. అఖిల్ ‘లెనిన్’ వాయిదా పడటంతో ఏర్పడిన ఖాళీని పాత హిట్ సినిమాలు భర్తీ చేస్తున్నాయి. మహేష్ బాబు ‘ఒక్కడు’, పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’, ‘హనుమాన్’ 3డీ రీ-రిలీజ్‌తో ప్రేక్షకులను అలరించనున్నాయి. మరోవైపు హిందీలో ‘వెల్‌కమ్ టు జంగిల్’ మాత్రమే భారీ విడుదలగా వస్తోంది.
ఏమన్నా అంటే సోలో రిలీజ్ డేట్ దొరకట్లేదు అంటుంటారు నిర్మాతలు.. కానీ కొన్నిసార్లు దొరికిన సోలో డేట్స్‌ను మాత్రం అలా వదిలేస్తుంటారు. ఈ వారం అదే జరుగుతుంది. ఒక్కటంటే ఒక్క క్రేజీ సినిమా కూడా జూన్ 26న థియేటర్లలోకి రావట్లేదు. దాంతో వచ్చిన ఈ గోల్డెన్ ఆపర్చునిటీని పాత సినిమాలే యూజ్ చేసుకుంటున్నాయి. మూకుమ్మడి దండయాత్ర చేస్తున్నాయి. గతవారం విడుదలైన మా ఇంటి బంగారం సినిమాకు మరో వారం దొరికేసింది.. ఈ వీక్ సినిమాలేవీ లేకపోవడం సమంత మూవీకి కలిసొచ్చే విషయం. ఎలాగూ జనాల్లోకి వెళ్లింది కాబట్టి రెండో వారం కూడా బంగారానికి వసూళ్లు బానే వచ్చేలా ఉన్నాయి. ఈ శుక్రవారం పరిస్థితి మాత్రం మరింత దారుణంగా ఉంది. అఖిల్ ‘లెనిన్’ జూన్ 26 నుంచి వాయిదా పడ్డాక.. దాన్నెవరూ క్యాష్ చేసుకోలేకపోయారు. ‘లెనిన్’ రాత్రికే రాత్రే వాయిదా వేయలేదు.. 10 రోజుల ముందే చెప్పారు నిర్మాతలు. అయినా కూడా జూన్ 26న ఏ సినిమా రావట్లేదు. దాంతో పాత సినిమాలనే తీసుకొస్తున్నారు బయ్యర్లు. మహేష్ బాబు ఒక్కడుతో పాటు పవన్ గబ్బర్ సింగ్, రాజ్ తరుణ్ సినిమా చూపిస్తా మావా లాంటి పాత సినిమాలు ఈ వారం మరోసారి థియేటర్స్‌లోకి వస్తున్నాయి. ఇక హనుమాన్‌ను 3డిలో రిలీజ్ చేశారు. ఈ వారం తెలుగులో కొత్త సినిమాలేవీ లేవు కానీ హిందీలో మాత్రం వెల్‌కమ్ టూ జంగిల్ విడుదల కానుంది. జూన్ 26న విడుదలవుతున్న ఈ చిత్రంలో సగం బాలీవుడ్ నటించింది. అక్షయ్ కుమార్ మెయిన్ హీరోగా నటించిన ఈ చిత్రం వెల్‌కమ్ ఫ్రాంచైజీలో భాగంగా వస్తుంది. దీనిపై అంచనాలు బాగానే ఉన్నాయి. మొత్తానికి ఈ వారం హిందీ సినిమాతోనే సరిపెట్టుకోవాలిక.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాస్‌పోర్ట్‌కి అప్లై చేయాలా? త్వరపడండి.. జులై 1 నుంచి ఫీజులు పెరుగుతున్నాయ్!
తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలెర్ట్ 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు, పిడుగులు
Rashmika Mandanna: ట్రోలింగ్ భయంతో.. నోరు విప్పలేకపోతున్నా.. రష్మిక ఎమోషనల్
రూ.20 కడితే.. రూ.2 లక్షల బీమా.. అయినా ఎందుకింత నిర్లక్ష్యం?
ఖర్జూరం ప్రియులు తస్మాత్ జాగ్రత్త! గడువు ముగిస్తే.. ముప్పు తప్పదు!