Director Veerabhadram Chaudhary: నాగార్జున సినిమా నా కెరీర్‌ను నాశనం చేసింది..! షాకింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్..
ఎన్నో ఆశలతో.. కోటి ఊహలతో.. తనేంటో నిరూపించుకోవాలనే టార్గెట్‌తో.. డైరెక్టర్‌గా తమ ఫిల్మ్ కెరీర్ స్టార్ట్ చేసిన కొంత మంది డైరెక్టర్లు.. ఆ జర్నీలో మధ్యలోనే ఆగిపోతారు. లక్ కలిసి రాకో.. టైం బ్యాడ్ అయ్యో.. లేక తమ చేతుల్లో లేని విషయాలకు తామే బాధ్యులుగా మారో.. తమ కెరీర్లో ఓటమి పాలవుతారు. ఎంత ప్రయత్నించినా..
ఎన్నో ఆశలతో.. కోటి ఊహలతో.. తనేంటో నిరూపించుకోవాలనే టార్గెట్‌తో.. డైరెక్టర్‌గా తమ ఫిల్మ్ కెరీర్ స్టార్ట్ చేసిన కొంత మంది డైరెక్టర్లు.. ఆ జర్నీలో మధ్యలోనే ఆగిపోతారు. లక్ కలిసి రాకో.. టైం బ్యాడ్ అయ్యో.. లేక తమ చేతుల్లో లేని విషయాలకు తామే బాధ్యులుగా మారో.. తమ కెరీర్లో ఓటమి పాలవుతారు. ఎంత ప్రయత్నించినా.. మరో ఛాన్స్ రాక.. దొకర్కా.. ఎక్కడ వేసిన గొంగలిలా అక్కడే ఉండి పోతారు. అలా తాను కూడా ఉన్నా అంటూ.. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్కిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు డైరెక్టర్ వీరభద్ర. అందులోనూ.. నాగార్జున్ సినిమా కారణంగానే తన కెరీర్ నాశనం అయిందంటూ.. ఓ బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎస్! అల్లరి నరేష్ హీరోగా తెరెకెక్కిన ఆహా నా పెళ్లంట సినిమాతో.. డైరెక్టర్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వీరభద్రం.. ఆ సినిమా హిలయరెస్ హిట్టు కొట్టడంతో… ఆ తరువాత సునిల్ హీరోగా పూలరంగడు సినిమా చేశారు. అది కూడా సూపర్ డూపర్ హిట్టు కావడంతో… కింగ్ నాగార్జునను డైరెక్టర్ చేసే ఛాన్స్ కొట్టేశారు. ఆయనను మాఫియా డాన్‌గా చూపిస్తూ.. భాయ్ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు.అయితే ఈసినిమా దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ కారణంగా మ్యూజికల్ హిట్ గా నిలిచింది కానీ.. సినిమా మాత్రం డిజాస్టర్ టాక్ వచ్చేలా చేసుకుంది. నాకు కూడా నచ్చలేదనే కామెట్ కింగ్ నాగార్జున నోటి నుంచి చాలా ఇంటర్య్వూలో బయటికి వచ్చింది. అయితే ఓ స్టార్ హీరో.. ఇలా తాను నటించిన సినిమా అస్సలు బాలేదంటూ.. అందులో తన తప్పేం లేదంటూ.. కాస్త బాహాటంగా చెప్పడంతో.. డైరెక్టర్ వీరభద్రం కెరీర్ ఇరుకున పడిందట. ఆ సినిమా తరువాత నుంచే.. బడా హీరోలెవరూ… తనతో సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదట. ప్రొడ్యూసర్లు కూడా… తనతో సినిమా చేసేందుకు ముందుకు రాలేదని.. దాంతో కెరీర్లో అక్కడే ఆగిపోవాల్సి వచ్చిందని తాజాగా ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు ఈయన. ఆ మాటలతో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ కూడా అవుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!