Thandel: గుడ్ న్యూస్ తండేల్ OTT డేట్ ఫిక్స్?

Updated on: Feb 26, 2025 | 5:19 PM

ప్లాప్ సినిమాకు కూడా రీసెంట్‌ డేస్‌లో ఓటీటీ స్ట్రిమింగ్ పై విపరీతమైన వెయిటింగ్ ఉంటోంది. అలాంటిది తండేల్ లాంటి హిట్ సినిమాకు ఓటీటీ స్ట్రీమింగ్‌ విషయంలో వెయిటింగ్ ఉండదా చెప్పండి! ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది. అయితే అందరి వెయిటింగ్‌కు ఆన్సర్‌గా ఇప్పుడు తండేల్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పై ఓ న్యూస్ నెట్టింట బయటికి వచ్చింది.

నాగ చైతన్య, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా.. చందూ మొండేటి డైరెక్షన్లో తెరకెక్కిన పాన్ ఇండియా ఫిల్మ్ తండేల్. ఎన్నో అంచనాల మధ్య ఫిబ్రవరి 7న రిలీజ్‌ అయిన ఈసినిమా సూపర్ డూపర్ హిట్టైంది. కలెక్షన్స్‌ను కుమ్మేసింది. దాంతో పాటే.. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి అందరూ ఆరా తీసేలా చేసుకుంటోంది. ఇక తండేల్ మూవీ ఓటీటీ రైట్స్‌ను దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్ .. ఈ మూవీని ముందుగా మార్చ్‌ 6నే స్ట్రీమింగ్ చేయనున్నట్టు ఓ టాక్ బయటికి వచ్చాంది. కానీ ఇప్పుడు ఈ తేదీ మార్చ్‌ 14కు మారినట్టు లేటెస్ట్ టాక్ ఒకటి ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ టాక్ పై కానీ.. స్ట్రీమింగ్ డేట్ పై కానీ.. మేకర్స్ నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ లేదు.! సో తండేల్ మూవీ అఫీషియల్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ కోసం.. మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భర్తకు రూ.150 కోట్ల ఆస్తి.. పైగా తను కోట్ల హీరోయిన్! ఇక ఊరుకుంటుందా?

హైదరాబాద్‌లో చికెన్, గుడ్లు ఫ్రీ.. ఎగబడ్డ జనం

కొట్టేసిన సోమ్ముతో కుంభమేళాకు.. గర్ల్‌ ఫ్రెండ్స్‌తో ఎంజాయ్‌

వృద్ధురాలైన తల్లిని ఇంట్లో లాక్‌ చేసి కుంభమేళాకు వెళ్లిన కొడుకు

TOP 9 ET News: ‘ప్రభాస్‌’ పేరుతో ఊరు.. ఖుషీగా రెబల్ స్టార్ ఫ్యాన్స్ | జస్ట్ మిస్.. లేదంటే.. పుష్ప2 రికార్డ్ బద్దలయ్యేది