Rajamouli: రాజమౌళి నెక్స్ట్ టార్గెట్ నాగ చైతన్య.. అసలు విషయం ఇదే

Updated on: Feb 24, 2026 | 5:41 PM

రాజమౌళి, నాగచైతన్యల భేటీపై వచ్చిన వార్తలకు స్పష్టత లభించింది. తండేల్ తర్వాత నాగచైతన్య నటనకు ముగ్ధులై, రాజమౌళి ఆయనను వారణాసి చిత్రంలో నటించమని అప్రోచ్ అయ్యారనే వార్తలు అవాస్తవమని తేలింది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో వారణాసి సినిమాకు సంబంధించిన సాంకేతిక వ్యవహారాలపై ఇరువురు చర్చించుకున్నారని యూనిట్ వర్గాలు స్పష్టం చేశాయి. కొత్త సినిమా ప్రణాళికలు ఏవీ లేవని ఖరాఖండిగా చెప్పారు.

రాజమౌళి, నాగచైతన్యల భేటీపై సినీ వర్గాల్లో తీవ్ర చర్చ జరిగింది. ట్రెండింగ్‌లో ఉన్న ప్రముఖుల ప్రతి కదలికను ప్రజలు గమనిస్తున్న నేపథ్యంలో, ఈ సమావేశం గురించి పలు ఊహాగానాలు వెలువడ్డాయి. తండేల్ సినిమాలో నాగచైతన్య నటనను చూసి రాజమౌళి ఎంతగానో ముగ్ధులయ్యారని, తన వారణాసి చిత్రంలో ఓ ప్రత్యేక పాత్ర కోసం ఆయన్ను సంప్రదించారని మొదట వార్తలు వైరల్ అయ్యాయి. అంతేకాదు, వారణాసి అనంతరం నాగచైతన్యతో రాజమౌళి ఓ సినిమా చేయబోతున్నారని, దాన్ని అన్నపూర్ణ సంస్థ లేదా కార్తికేయ నిర్మించే అవకాశం ఉందని మరో వర్షన్ కూడా విస్తరించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఐకాన్ స్టార్ బ్రాండ్ వ్యాల్యూ పెంచిన పుష్ప.. ఒక సినిమా కాదు, ఒక బ్రాండ్

UstaadBhagatSingh: గ్రాండ్ గా రిలీజ్ అయిన ఆరా ఆఫ్ ఉస్తాద్

Tollywood News: సమంత నుండి తాప్సి వరకు.. అన్ని సినీ వార్తలు మీ కోసం

Malaika Arora: అర్జున్ కపూర్‌తో బ్రేకప్.. మరొకరితో మొదలైన ప్రేమాయణం

ఒకే రోజు రిలీజ్ అవుతున్న ధురంధర్ 2, టాక్సిక్

Loading...
Unable to load recommendations.
Follow Us