Thaman: టాప్ స్టార్స్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న తమన్
ఒక్క భారీ సినిమా చేస్తేనే ఏ టెక్నీషియన్ అయినా... చిన్న బ్రేక్ కావాలనుకుంటారు. కానీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. మోస్ట్ అవెయిటెడ్ సినిమాలకు సంగీతమందించటమే కాదు. ఆ సినిమాల ప్రమోషన్స్‌లోనూ కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇంత బిజీలో అలాంటి టైమ్ మ్యానేజ్మెంట్ తమన్‌కు మాత్రమే ఎలా సాధ్యమవుతోంది.
ఈ ఏడాది ఇప్పటికే ఏడు సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చారు మ్యూజిక్ సెన్సేషన్ తమన్. సక్సెస్ ఫెయిల్యూర్, చిన్నా పెద్ద అన్న తేడా లేకుండా వరుస సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నారు. ఓ వైపు భారీ ప్రాజెక్ట్స్‌కు పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తూనే మరో వైపు ప్రమోషన్స్‌కు కూడా టైమ్ ఇస్తున్నారు. నిన్న మొన్నటి వరకు అభిమానుల్లో ఓజీ మేనియాను డబుల్ చేయటంలో కీలక పాత్ర పోషించారు తమన్. ఇప్పుడు అఖండ 2 సందడి మొదలైంది. ప్రజెంట్ ఈ సినిమా పనుల్లోనే బిజీగా ఉన్నారు మ్యూజిక్ సెన్సేషన్ డిసెంబర్ 5న అఖండ 2 ఆడియన్స్ ముందుకు రానుంది. ఆల్రెడీ అఖండతో బాలయ్య, తమన్ కాంబినేషన్ మీద భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఆ తరువాత వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకూ మహరాజ్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ ఈ కాంబోలోనే వచ్చాయి. అందుకే మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతుండటంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ ఎగ్జైటింగ్‌గా ఉన్నారు. అఖండ 2 సందడి అలా ముగియగానే వెంటనే ది రాజాసాబ్ వర్క్‌లో దిగిపోతారు తమన్. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ హారర్ కామెడీ మూవీకి సంబంధించిన ప్రమోషన్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు తమన్. ఇలా వరుసగా భారీ ప్రాజెక్ట్స్‌తో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నారు ఈ మ్యూజిక్ సెన్సేషన్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Alia Bhatt: షూట్‌లో కాదు.. ఇంట్లో ఉన్నట్టే ఉంది అంటున్న అలియా
Sreleela: నన్ను చేసుకోబోయేవాడు అలానే ఉండాలి.. చెప్పిన శ్రీలీల
Krrish 4: క్రిష్ మూవీలో జాకీచాన్.. డీల్ ఓకేనా
‘అదో బుద్ధి లేని నిర్ణయం’.. పవన్ తో సినిమాను ఆలా ఎలా రిజెక్ట్ చేసాడు మావా
నిర్మాతలకు సీఎం రేవంత్ ఝలక్ టికెట్ రేట్లు పెంచాలంటే ఆ పని చేయాల్సిందే
