AR Rahman Emotional: భార్య విడాకులు.. ఎమోషనల్ అయిన రెహ్మాన్.! వీడియో

Updated on: Nov 21, 2024 | 12:49 PM

దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ దంపతులు తమ మూడు దశాబ్దాల వైవాహిక బంధానికి స్వస్తి పలకనున్నారు. రెహమాన్ భార్య సైరా తన భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఆమె తరపు లాయర్ వందనా షా అధికారిక ప్రకటన విడుదల చేశారు. 29 ఏళ్ల వివాహ బంధానికి రెహమాన్‌తో సైరా ముగింపు పలుకుతున్నట్టు చెప్పారు.

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్‌.. తన విడాకుల పై కాస్త ఎమోషనల్‌గా రియాక్టయ్యారు. తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఓ పోస్ట్ పెట్టారు. ఇక తన సోషల్ మీడియాలో పోస్టులో.. తాము సంతోషంగా ముప్పైకి చేరుకోవాలని ఆశించామని చెప్పిన రెహ్మాన్‌.. కానీ అన్ని విషయాలు అనుకున్న ముగింపు తీసుకోవంటూ తన పోస్టులో రాసుకొచ్చారు. ముక్కలైన హృదయాల బరువుకు ఆ దేవుడి సింహాసనం సైతం వణుకుతుందని.. అయినా ఈ ముగింపులో తాము మరో అర్థాన్ని వెతుకున్నామంటూ చెప్పారు. అంతేకాదు విరిగిన ముక్కలు మళ్లీ పూర్వంలా కనిపించవంటూ కాస్త ఎమోషనల్‌గా తన పోస్ట్‌లో రాసుకొచ్చారు రెహ్మాన్‌.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Loading...
Unable to load recommendations.
Follow Us