Mrunal Thakur: ఆఫర్స్‌ వస్తున్నా.. కావాలనే ‘నో’ చెబుతున్నా.. మృణాల్ ఠాకూర్‌

Edited By:

Updated on: Oct 17, 2026 | 6:10 PM

‘సీతారామం’, ‘హాయ్‌ నాన్న’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మృణాల్‌ ఠాకూర్‌ కొత్త సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ‘డెకాయిట్‌’ తర్వాత కొత్త ప్రాజెక్టులకు సైన్‌ చేయకపోవడంపై స్పందించిన ఆమె, పేరు కోసం లేదా సినిమాల సంఖ్య పెంచుకోవడం కోసం చిత్రాలు చేయనని స్పష్టం చేసినట్లు సమాచారం. తనకు నచ్చిన కథ, నటనకు అవకాశం ఉన్న పాత్ర దొరికినప్పుడే కొత్త సినిమాను అంగీకరిస్తాననే వైఖరితో ఉన్నారు.

సీతారామం, హాయ్ నాన్న లాంటి సూపర్ హిట్లతో జోరుమీదున్న మృణాల్ ఠాకూర్, బ్రేక్ తీసుకున్నారు. ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు వస్తున్నా ఆమె కొత్త ప్రాజెక్టులకు సైన్ చేయకపోవడంపై క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ మృణాల్ తీసుకున్న నిర్ణయమేంటి..? హావ్ ఏ లుక్. సీతారామం సినిమాతో ఓవర్‌నైట్‌లో స్టార్‌గా మారిన మృణాల్ ఠాకూర్‌ తర్వాత హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ లాంటి సినిమాలతో బిజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు. రీసెంట్ గా అడివి శేష్ తో డెకాయిట్ సినిమాలోనూ నటించారు. డెకాయిట్ రిలీజ్‌ తరువాత కొత్త సినిమాకు సైన్ చేయలేదు ఈ బ్యూటీ. తాజాగా తన కొత్త ప్రాజెక్టులపై వస్తున్న కామెంట్స్ మీద స్పందించిన మృణాల్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. పేరు కోసమో, నెంబర్‌ కోసమో హడావుడిగా సినిమాలు చేయడం తనకు ఇష్టం లేదన్నారు. తాను నటించే ప్రతి సినిమా అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉండాలిని, అదే టైమ్‌లో తనకు కూడా నటిగా శాటిస్ఫ్యాక్షన్ ఇవ్వాలన్నారు. ప్రస్తుతం తన వద్దకు వస్తున్న కథలు తనకు అంతగా కనెక్ట్ కాకపోవడం వలనే కొత్త చిత్రాలకు సైన్ చేయలేదన్నారు. ఒక సినిమా కోసం సెట్స్‌లో సుదీర్ఘ కాలం గడపాల్సి ఉంటుందని, అలాంటప్పుడు పూర్తి డెడికేషన్‌తో పనిచేసేందుకు బలమైన కథాంశాలు అవసరమన్నారు. నెంబర్ గేమ్ కోసం సినిమాలు చేయనని క్వాలిటీనే ఫస్ట్ ప్రియారిటీ అని కుండబద్దలు కొట్టేశారు. భవిష్యత్తులో కూడా కేవలం తన నటనకు స్కోప్ ఉన్న పాత్రలనే ఎంచుకుంటానని క్లారిటీ ఇచ్చారు మృణాల్. తన నెక్ట్స్ సినిమాలకు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ ఉన్నా తానే అధికారికంగా వెల్లడిస్తానని, రూమర్స్‌ను నమ్మవద్దని కోరారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ 10 విన్నర్ ఎవరో తేల్చేసిన కౌశల్!

Weather Report: దసరా పండగ వేళ చల్లని కబురు.. తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్

ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్.. దసరాకు 7 వేల ప్రత్యేక బస్సులు

భార్యను లాడ్జ్‌కి తీసుకెళ్లాడు.. రాత్రంత్రా హ్యాపీగా ఉన్నారు.. ఉదయాన్నే బాత్‌రూంలో

Jabardasth Actor Babu: వా.. బాబు..! జబర్దస్త్‌ కమెడియన్ TO సక్సెస్‌ఫుల్ డైరెక్టర్!

Published on: Oct 17, 2026 06:10 PM
Loading...
Unable to load recommendations.
Follow Us