బ్రేకప్ గురించి రివీల్ చేసిన హీరోయిన్

Updated on: Feb 04, 2026 | 6:30 PM

నటి మృణాల్ ఠాకూర్ తన ప్రేమ జీవితం గురించి, ధనుష్‌తో సంబంధంపై వస్తున్న పుకార్లపై స్పష్టత ఇచ్చారు. ధనుష్ తనకు సోదరుడిలాంటి వాడని ఆమె పేర్కొన్నారు. గతంలో నటన నచ్చని కారణంగా బ్రేకప్ అయిందని రివీల్ చేశారు. ఆమె నటిస్తున్న దో దివానే షహర్ మే, డెకాయిట్ చిత్రాల ప్రమోషన్స్‌లో భాగంగా ఈ విషయాలు వెల్లడించారు.

బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మధ్య రిలేషన్ షిప్ అంటూ కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ పుకార్లపై మృణాల్ అనేకసార్లు వివరణ ఇచ్చినా, వాటికి బ్రేక్ పడకపోవడంతో తాజాగా షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ధనుష్ తనకు మంచి స్నేహితుడు మాత్రమే కాదు, సోదరుడిలాంటి వాడు అని మృణాల్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో వారిద్దరిపై వస్తున్న రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. తాజా ఇంటర్వ్యూలో తన లవ్ లైఫ్ గురించి కూడా మృణాల్ మాట్లాడారు. గతంలో తాను ఒక అబ్బాయితో రిలేషన్‌షిప్‌లో ఉన్నానని, అయితే తన నటనను అతను ఇష్టపడకపోవడంతో బ్రేకప్ చెప్పేశాడని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు అతడిని తలుచుకుంటే జాలేస్తుందని ఆమె వెల్లడించారు.

మరిన్ని వీడియోల కోసం :

బిజీ రోడ్డుపై ఆటో స్టంట్స్.. పోలీసుల ముందే ఓవరాక్షన్‌!

ఈ ఇద్దరు అమ్మాయిలు సూసైడ్ బాంబర్లు .. వీడియో

పొలాల్లో చిరుతలు.. వణుకుతున్న తర్లపాడు ప్రజలు

నగరంలో పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు వీడియో