నాన్నే నా స్పూర్తి.. చరణ్‌తో మోదీ ఆత్మీయ సంభాషణ.. చిరు మెచ్చిన బంగారం సమంత

Updated on: Jun 25, 2026 | 12:50 PM

ప్రధాని మోదీ, రామ్ చరణ్ మధ్య ఆత్మీయ సంభాషణ వైరల్. తండ్రి చిరంజీవి తనకు స్ఫూర్తి అని రామ్ చరణ్ వెల్లడి. సమంత నటించిన మా ఇంటి బంగారం చిత్రం రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. చిరంజీవి ప్రశంసలు అందుకున్న ఈ సినిమా టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

తెలిసిన వారిని పలకరించే అలవాటున్న ప్రధాని నరేంద్ర మోదీ, ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ నేషనల్ సమ్మిట్‌లో రామ్ చరణ్, ఉపాసనలను ఆత్మీయంగా పలకరించారు. వారి యోగక్షేమాలు కనుక్కుని ముందుకు సాగారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఇదిలా ఉండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్‌లో తండ్రి చిరంజీవి సపోర్ట్‌పై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 15 ఏళ్ల కెరీర్‌లో తన నటనకు సంబంధించి తండ్రి ఎలాంటి ఫీడ్‌బ్యాక్ ఇవ్వలేదని తెలిపారు. క్రమశిక్షణ విషయంలో తండ్రే తనకు స్ఫూర్తి అని చరణ్ పేర్కొన్నారు.మరోవైపు, సమంత నటించిన మా ఇంటి బంగారం చిత్రం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ఉమ్మడి కుటుంబం నేపథ్యంలో యాక్షన్, భావోద్వేగాలను అందంగా మేలవించిన దర్శకురాలు నందిని రెడ్డిని, అలాగే తన నటనతో ఆకట్టుకున్న సమంతను చిరు అభినందించారు. ముఖ్యంగా చీరకట్టులో సమంత చేసిన యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని చిరు కొనియాడారు. ఇలాంటి వైవిధ్యమైన మహిళా ప్రాధాన్య చిత్రాలు తెలుగు సినీ పరిశ్రమకు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

Follow Us