NTR ఫ్యాన్స్ ఎఫెక్ట్.. జల్లికట్టులో మనోడే హైలెట్!

Updated on: Feb 20, 2025 | 12:39 PM

సినిమాలతో పాటు ఈ మధ్య పలు రాజకీయ వేదికలపై కూడా కనిపిస్తున్నాడు మంచు మనోజ్. ఈయన ఎక్కడికి వచ్చినా.. స్పెషల్ అట్రాక్షన్ అవుతున్నాడు. ఎప్పుడు ఏం మాట్లాడతాడో అంటూ మంచు వారబ్బాయి బాగా ట్రెండ్ అవుతున్నాడు కూడా. తాజాగా ఈయన మరో వేడుకకు వచ్చాడు. తిరుపతిలోని చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన జల్లికట్టు వేడుకలకు మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.

ఆయన్ని చూడ్డానికి చాలా మంది అభిమానులు హాజరయ్యారు. అంతేకాదు ముఖ్య అతిథిగా వచ్చిన మంచు మనోజ్‌కు టిడిపి, జనసేన, ఎన్టీఆర్ అభిమానులు గ్రాండ్ వెల్‌కమ్ పలికారు. టిడిపి, జనసేన, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో డప్పులతో, బాణసంచాలతో అంగరంగ వైభవంగా మొదలైన ఈ జల్లికట్టు వేడుకలలో పశువులను అందంగా అలంకరిస్తూ ఊరంతా ఊరేగింపుగా జరుపుకుంటారు. ఈ వేడుకలకు హీరో మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరవడంతో.. యూత్ అంతా ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొని సెలబ్రేట్ చేశారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవడంపై నటుడు మంచు మనోజ్ సంతోషం వ్యక్తం చేశారు. బ్రిటీష్ కాలం నుండి ‘జల్లికట్టు’ పండుగ జరుగుతూనే ఉంది. సంస్కృతి, సాంప్రదాయాలకు గుర్తుగా చేసుకునే ఈ జల్లికట్టు వేడుకలను గత 20 సంవత్సరాలుగా ఈ చంద్రగిరి నియోజకవర్గంలో నిర్వహించడం చాలా గొప్ప విషయం అని చెప్పిన మనోజ్‌.. తమిళనాడు ‘జల్లికట్టు’తో పోల్చుకుంటే ఇక్కడ అంత సివియర్‌గా ఉండదంటూ చెప్పుకొచ్చాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Shweta Basu: ఆ తెలుగు హీరో పదే పదే ఇబ్బంది పెట్టారు..

Vicky Kaushal: అందరికీ షాకిస్తున్న ఛావా హీరో సంపాదన..

Loading...
Unable to load recommendations.
Follow Us