మారుతున్న ట్రెండ్.. డిజిటల్ వైపు అడుగులేస్తున్న టాలీవుడ్ హీరోలు

Updated on: Feb 13, 2026 | 5:00 PM

ఇప్పటివరకు థియేటర్లలో మాత్రమే కనిపించిన స్టార్ హీరోలు ఇప్పుడు డిజిటల్ వేదికల వైపు చూస్తున్నారు. నాగ చైతన్య, రవితేజ, అడవి శేష్ వంటి హీరోలు వెబ్ సిరీస్‌లు, ఒరిజినల్ మూవీస్ ప్లాన్ చేస్తున్నారు. హీరోయిన్లు సమంత, తమన్నా, కీర్తి సురేష్ ఇప్పటికే ఓటీటీలో ప్రవేశించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇది కొత్త ఒరవడికి దారి తీస్తోంది.

ఇప్పటివరకు సినిమా థియేటర్లకు, ఓటీటీ కంటెంట్‌కు వేర్వేరు హీరోలుండేవారనే అభిప్రాయం ఉండేది. అయితే, ఈ పరిస్థితి క్రమంగా మారుతోంది. మెయిన్‌స్ట్రీమ్ స్టార్ హీరోలు సైతం ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ వైపు దృష్టి సారిస్తున్నారు. బాలీవుడ్‌లో ఇప్పటికే కొందరు పెద్ద హీరోలు వెబ్ కంటెంట్ చేస్తున్నారు కానీ, తెలుగులో ఈ ట్రెండ్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. రెండు సంవత్సరాల క్రితమే నాగ చైతన్య దూత అనే వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ రంగంలో ప్రవేశించారు. దీనికి దర్శకత్వం వహించిన విక్రమ్ కె కుమార్ మనం ఫేమ్ ద్వారా సుపరిచితుడు. దూత సీజన్ 2 కూడా త్వరలో రానుంది. మాస్ రాజా రవితేజ సైతం Amazon Prime Video లో తన తొలి వెబ్ సిరీస్ కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. దీని ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. కిరణ్ అబ్బవరం, డియర్ కామ్రేడ్ ఫేమ్ భరత్ కమ్మ కాంబినేషన్‌లో Amazon Prime లో మరో వెబ్ సిరీస్ రాబోతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే దబిడి దిబిడే.. ఇంకా జాగ్రత్త బాస్

OTT ట్రెండింగ్‌లో ఎప్‌స్టీన్ వెబ్ సిరీస్‌.. రసవత్తరంగా సాగే కథ

IRCTC: రైలు ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక మీకు కావాల్సింది సీట్ వద్దకే

భార్య సీక్రెట్ లైఫ్‌ను బయటపెట్టిన ఆధార్‌ ఓటీపీ

The Raja Saab: రాజాసాబ్‌కు కొత్త తలనొప్పి.. ఓటీటీలో బయటపడిన నిజాలు

Sravanthi Chokarapu: బన్నీపై యాంకర్ స్రవంతి కామెంట్స్

 

Follow Us