Mahesh Babu Shoot Leak Video: బాలీవుడ్‌ స్టార్‌తో ప్రిన్స్‌ మహేష్‌ మూవీ..లీకైన షూట్‌ వీడియో..

|

Sep 06, 2021 | 6:02 PM

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ ప్రిన్స్‌ మహేష్‌ బాబు బాలీవుడ్‌ స్టార్‌ హీరోతో కలిసి నటించారు. స్టార్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌ తో కలిసి ఓ యాడ్‌లో నటిస్తున్నారు ప్రిన్స్‌ మహేష్‌. దీనికి సంబంధించిన షూట్‌ లీక్‌ అవడంతో మహేష్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ టాప్ హీరో అయిన ఈ ఆరు అడుగుల అందగాడికి అంతులేని అభిమాన గణం ఉంది. ఇక మహేష్ సినిమాలతోపాటు, వాణిజ్యప్రకటనల్లో కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఇప్పటికే థమ్స్‌ అప్ యాడ్‌లో మహేష్ నటించిన విషయం తెలిసిందే. ఇంకా చాలా యాడ్స్‌లో నటించిన మహేష్ ఇటీవలే మిల్కీ బ్యూటీ తమన్నాతో కలిసి ఓ యాడ్ చేశారు. ఇప్పుడు పాన్ బహార్ ఇలాచీ కోసం మరో యాడ్‌లో నటిస్తున్నారు మహేష్. తాజాగా ఈ ప్రకటనకు సంబంధించిన షూటింగ్ జరిగింది. ఈ షూటింగ్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మహేష్ సతీమణి నమ్రత ఈ షూట్‌కి సంబంధించిన ఫోటోలను, ఓ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. దాంతో మహేష్ న్యూ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే.. ఈ యాడ్‌లో బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ కూడా కనిపించనున్నారట. ఇప్పటికే మహేష్ బాబు బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ తో కలిసి నటించిన విషయం తెలిసిందే. మహేష్ – రణ్ వీర్ కలిసి థమ్స్ అప్ యాడ్‌లో కలిసినటించారు. ఇప్పుడు టైగర్ మహేష్‌తో కలిసి స్క్రీన్ పంచుకోనున్నారు. తాజాగా మహేష్- టైగర్ ష్రాఫ్ పై ‘పాన్ బహార్ ఇలాచీ’ యాడ్‌ కోసం షూట్ చేస్తున్నారు. ఇక టైగర్ బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంటే.. మహేష్ సర్కారు వారి పాట సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. పరశు రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.YouTube video player
మరిన్ని ఇక్కడ చూడండి: వీరమాచినేని సూచించే డైట్ తీస్కోవాలా..? వద్దా..? డైట్ పై డౌట్స్ ఎందుకు..?(వీడియో):Veeramachaneni Vs Indian Medical Association video.

The Baker And The Beauty Press Meet: మొదలైన శోభన్‌, టినా శిల్పరాజ్‌ జంటగా ది బేకర్‌ అండ్ ది బ్యూటీ ప్రెస్ మీట్ లైవ్ వీడియో.

Afghanistan Crisis Live Video: పంజాషీర్ లోయ తాలిబన్ల వశం కాబోతుందా..?పంజ్ షేర్ లో భీకర యుద్ధం (లైవ్ వీడియో).

Special Bulletin Video: వైరల్ అవుతున్న పందుల పోటీలు..!| తెల్ల చెక్కరతో మతిమరుపు..!(స్పెషల్ వైరల్ వీడియోలు).