‘మా ఇంటి బంగారం’కు సూపర్ ఓపెనింగ్స్.. ‘మైసా’ సినిమాకు పాజిటివ్ వైబ్స్
సమంత ప్రధాన పాత్రలో వచ్చిన ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. తొలి రోజే రూ.13.5 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం, సరైన కథతో పాటు బలమైన ప్రమోషన్ ఉంటే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా స్టార్ హీరోల సినిమాల స్థాయిలో వసూళ్లు సాధించగలవని నిరూపించింది.
పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటే లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో కూడా అదిరిపోయే ఓపెనింగ్స్ రాబట్టొచ్చా..? కంటెంట్ కరెక్టుగా క్లిక్ అయితే స్టార్ హీరోల రేంజ్‌లో ఓపెనింగ్స్ వస్తాయా..? మా ఇంటి బంగారం ఓపెనింగ్స్ ఇండస్ట్రీకి ఏం నేర్పిస్తుంది..? రాబోయే ఫీమేల్ సెంట్రిక్ సినిమాలకు సమంత సినిమా కలెక్షన్స్ ఊపిరి పోస్తున్నాయా..? మా ఇంటి బంగారం సినిమాపై ముందు నుంచి అంచనాలు బానే ఉన్నా.. ఓపెనింగ్స్ విషయంలో మాత్రం ఎక్కడో చిన్న అనుమానాలు అలాగే ఉండిపోయాయి. లేడీ ఓరియెంటెడ్ సినిమా కదా ఆడియన్స్ వస్తారా లేదా అని మేకర్స్ కూడా కాస్త కంగారు పడే ఉంటారు. కానీ పర్ఫెక్ట్ ప్రమోషన్.. స్టార్ పవర్ తోడైతే వండర్స్ క్రియేట్ చేయొచ్చని సమంత నిరూపించారు. ఈ వారం నాలుగైదు సినిమాలు విడుదలైనా.. బాక్సాఫీస్ దగ్గర లీడ్ తీసుకున్నది మాత్రం బంగారమే. సమంత స్టార్ పవర్, రాజ్ నిడిమోరు రైటింగ్, నందిని రెడ్డి ఈ సినిమాకు బాగా హెల్ప్ అయ్యాయి. ఫస్ట్ డేనే 13.5 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఔరా అనిపించింది మా ఇంటి బంగారం. చూస్తుంటే వీకెండ్ నాటికే సేఫ్ అయ్యేలా ఉంది. గతేడాది గర్ల్ ఫ్రెండ్‌తో రష్మిక సైతం మంచి సక్సెస్ అందుకున్నారు. ఘాటీతో అనుష్క నిరాశ పరిచినా.. గర్ల్ ఫ్రెండ్ లాంటి క్లాస్ సినిమాతో రష్మిక పాస్ మార్కులు అందుకున్నారు. తాజాగా మా ఇంటి బంగారంతో సమంత మాస్ చూపిస్తున్నారు. ఈ కలెక్షన్స్ రష్మిక నటిస్తోన్న మైసాకు పాజిటివ్ వైబ్స్ తెస్తున్నాయి. కథ బాగుండి.. ప్రమోషన్ వర్కవుట్ అయితే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా కలెక్షన్స్ కుమ్మేస్తాయనడానికి ఇవే నిదర్శనం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఖాళీగా ఓలా.. అయినా ఉబర్ కోసం అరగంట వెయిటింగ్! బెంగళూరులో వింత ఘటన
11 ఏళ్లకే యూకే యూత్ పార్లమెంట్ సభ్యురాలిగా రికార్డ్.. వైజాగ్ టు లండన్ కలశ నాయుడు ప్రయాణం
ఉద్యోగితో రూ. 2.5 లక్షల ఫిట్‌నెస్ బెట్ లో ఓడిన జెరోదా బాస్
ఫోన్ దొంగిలించి పారిపోతూ కుప్పకూలిన దొంగ.. క్షణాల్లో ప్రాణాలు గాల్లో..