సూర్య – జ్యోతిక లవ్ స్టోరీని.. లీక్‌ చేసిన లైలా

సూర్య – జ్యోతిక లవ్ స్టోరీని.. లీక్‌ చేసిన లైలా

Updated on: Nov 29, 2026 | 6:45 PM

తాజా ఇంటర్వ్యూలో నటి లైలా, సూర్య-జ్యోతికల ప్రేమ కథ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాను త్రీ రోజెస్ సినిమాలో జ్యోతికతో కలిసి పని చేస్తున్నప్పుడే వారిద్దరూ ప్రేమలో ఉన్నారని తెలిసిందని ఆమె తెలిపారు. జ్యోతిక స్వయంగా సూర్యతో తన ప్రేమ గురించి చెప్పిందని, సూర్య షూటింగ్ సమయంలో జ్యోతికను పికప్ చేసుకునేవారని లైలా పేర్కొన్నారు.

అందమైన చిరునవ్వు, సహజ నటనతో ప్రేక్షకులను అలరించిన నటి లైలా, తన రీసెంట్ ఇంటర్వ్యూలో స్టార్ కపుల్ సూర్య-జ్యోతికల ప్రేమ కథకు సంబంధించిన కొన్ని రహస్యాలను వెల్లడించారు. సూర్య-జ్యోతికలకు తాను సన్నిహిత మిత్రురాలినని, వారిద్దరి ప్రేమ గురించి తనకు ముందే తెలుసని లైలా పేర్కొన్నారు. లైలా, సూర్యతో కలిసి పలు సినిమాల్లో నటించారు. ముఖ్యంగా శివపుత్రుడు చిత్రంలో వారిద్దరి కెమిస్ట్రీకి మంచి స్పందన లభించింది. ఆ సినిమాలో సూర్య-లైలా జోడి జ్యోతికకు కూడా చాలా బాగా నచ్చిందని పలు సందర్భాల్లో ఆమె చెప్పడం గమనార్హం. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న లైలా, జ్యోతిక, తాను త్రీ రోజెస్ సినిమాలో కలిసి పని చేస్తున్న సమయంలోనే సూర్య, జ్యోతిక ప్రేమలో ఉన్నారన్న విషయం తనకు తెలిసిందని చెప్పుకొచ్చారు. అంతేకాదు, జ్యోతిక స్వయంగా సూర్యతో తన ప్రేమ గురించి తనతో చెప్పిందని లైలా రివీల్ చేశారు. ఆ రోజుల్లో షూటింగ్ సమయంలో సూర్య స్వయంగా తన కారులో వచ్చి జ్యోతికను పికప్ చేసుకునేవారంటూ వారి సీక్రెట్ రిలేషన్‌షిప్‌కు సంబంధించిన ఈ క్యూట్ మూమెంట్‌ను లైలా అందరితో పంచుకున్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Shruti Haasan: దుష్టశక్తులను ఆరాధిస్తోందా? శృతిని తప్పుగా అర్థం చేసుకున్నారా?

నవంబర్ సెంటిమెంట్ బ్రేక్… కాసులు కురిపిస్తున్న కంటెంట్‌

Dhanush: నాలుగోసారి అదే కాంబో.. బాలీవుడ్‌లో ధనుష్ భారీ ప్లాన్!

స్టార్ హీరోలకు ఇమేజ్ ట్రాప్… ఆ ముగ్గురిదీ ఒకటే ప్రాబ్లమ్!

Loading...
Unable to load recommendations.
Follow Us