Monalisa Bhosale: రక్షణ కోరుతూ కేరళం సీఎంకు మోనాలిసా లేఖ
కుంభమేళా స్టార్ మోనాలిసా భోస్లే బాల్య వివాహం వివాదంలో చిక్కుకుంది. తాను మేజర్‌నని రక్షణ కోరుతూ కేరళ సీఎంకు లేఖ రాయగా, తల్లిదండ్రులు, మధ్యప్రదేశ్ అధికారులు ఆమె మైనర్ అని వాదిస్తున్నారు. భర్త ఫర్మాన్ ఖాన్‌పై పోక్సో కేసు, రాజకీయ ఆరోపణలు, రెండు రాష్ట్రాల మధ్య చట్టపరమైన పోరుతో ఈ వివాదం తీవ్రమైంది. జాతీయ గిరిజన కమిషన్ దీనిపై విచారణ జరుపుతోంది.
కుంభమేళా వైరల్ స్టార్ మోనాలిసా భోస్లే వివాదం మలుపు తీసుకుంది. మధ్యప్రదేశ్ పోలీసులు తనను బలవంతంగా సొంతూరికి తీసుకెళ్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ, తనకు రక్షణ కల్పించాలని కేరళం ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు, కొచ్చి నగర పోలీస్ కమిషనర్‌కు ఆమె లేఖ రాసింది. తాను 18 ఏళ్లు నిండిన మేజర్‌నని ఆమె ఆ లేఖలో స్పష్టం చేసింది. మోనాలిసా భర్త ఫర్మాన్ ఖాన్‌పై నమోదైన పోక్సో చట్టం కేసుకు సంబంధించి వారి వాంగ్మూలాలను రికార్డ్ చేసేందుకు మధ్యప్రదేశ్ పోలీసు బృందం కొచ్చికి చేరుకున్న సమయంలో ఈ పరిణామం జరిగింది. తిరువనంతపురం సమీపంలోని ఓ ఆలయంలో మార్చి 11న వీరి వివాహం జరిగినప్పుడు మోనాలిసా మైనర్ అని జాతీయ గిరిజన కమిషన్ విచారణలో తేలడంతో పోక్సో కేసు నమోదైంది. అయితే, కేరళ హైకోర్టు నుంచి మే 20 వరకు అరెస్ట్ కాకుండా ఫర్మాన్ ఖాన్ స్టే తెచ్చుకున్నాడు. ఈ వివాదం కేరళంలో రాజకీయ దుమారం రేపింది. అధికార సీపీఎం నేతల అండతోనే మైనర్ బాలిక వివాహం జరిగిందని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్. సురేశ్ ఆరోపించారు. దీనికి బాధ్యులైన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే, ఈ ఆరోపణలను సీపీఎం ఖండించింది. తాము పెళ్లి నిర్వహించలేదని, విషయం తెలిసిన తర్వాత కేవలం హాజరయ్యామని స్పష్టం చేసింది. మోనాలిసా తల్లి లతా భోస్లే తన కుమార్తె 2009 డిసెంబర్‌లో జన్మించిందని, ఆమె మైనర్ అని వాదిస్తోంది. సినిమా అవకాశాల ఆశ చూపి తన కుమార్తెను ప్రలోభపెట్టి తీసుకెళ్లారని ఆరోపించారు. పెళ్లి కోసం నకిలీ బర్త్ సర్టిఫికెట్ సృష్టించారని, జాతీయ గిరిజన కమిషన్ ప్రాథమిక దర్యాప్తులోనూ ఇదే విషయం తెలిసిందని చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని ఆసుపత్రి రికార్డుల ప్రకారం వివాహ సమయంలో మోనాలిసా వయసు 16 ఏళ్లేనని తేలడం కేసును మరింత వివాదంగా మార్చింది. ప్రస్తుతం ఈ కేసుపై విచారిస్తున్న జాతీయ గిరిజన కమిషన్, కేరళం, మధ్యప్రదేశ్ రాష్ట్రాల సీనియర్ పోలీస్ అధికారులను ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఒకవైపు తాను మేజర్‌నని మోనాలిసా కేరళలో రక్షణ కోరుతుండగా, ఆమె కుటుంబం, మధ్యప్రదేశ్ అధికారులు మాత్రం ఆమె మైనర్ అని చెప్పడంతో ఈ కేసు రెండు రాష్ట్రాల మధ్య చట్టపరమైన, రాజకీయ పోరాటంగా మారింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆకాశం నుంచి నిప్పుల వర్షం.. మూడు రోజుల్లో మురిపించనున్న వర్షాలు
యురేనియం అప్పగింతకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్
ఇంటర్ ఫలితాల్లో అదరగొట్టిన ట్విన్స్.. ప్రతి సబ్జెక్ట్‌లో సేమ్ మార్కులు
పూజారి ఇంట్లో అద్భుతం.. సీతారాముల చెంత నాగేంద్రుడు ప్రత్యక్షం
జస్ట్ 50 వేల డాలర్ల ఆయుధంతో లక్షల డాలర్ల అమెరికా యుద్ధవిమానాలను కూల్చేస్తున్న ఇరాన్