రమ్యకృష్ణ కొడుకు ఫిల్మ్ ఎంట్రీ ?? తండ్రి ఏమన్నారంటే..

Updated on: Feb 24, 2026 | 7:53 PM

కృష్ణవంశీ, రమ్యకృష్ణల కొడుకు రిత్విక్ వంశీ సినీ ప్రవేశంపై వస్తున్న ఊహాగానాలకు కృష్ణవంశీ తెరదించారు. రిత్విక్ ప్రస్తుతం లండన్‌లో బిజినెస్ మేనేజ్‌మెంట్ చదువుతున్నాడని, సినిమాలపై ప్రస్తుతానికి ఆసక్తి లేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేదని, తన కొడుకు చాలా పరిణతితో ఆలోచిస్తాడని, తమను అర్థం చేసుకుంటాడని కృష్ణవంశీ సంతోషం వ్యక్తం చేశారు.

టాలీవుడ్‌లో ఎప్పుడూ వారసులు చర్చ జరుగుతూనే ఉంటుంది. ఓ సెలబ్రిటీ కొడుకు ఫోటోలు అలా నెట్టింట కనిపిస్తే చాలు.. ఇలా సినిమాల్లోకి వచ్చేస్తున్నాడనే వార్తలు కూడా పుట్టుకొస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో కృష్ణవంశీ, రమ్యకృష్ణ కొడుకు రిత్విక్ వంశీ కూడా సినిమాల్లోకి వస్తున్నాడంటూ.. ఓ న్యూస్ సోషల్ మీడియాలో నడిచింది. పలు పాడ్‌క్యాస్ట్‌ షోల్లో… కృష్ణ వంశీకి కూడా.. మీ కొడుకును సినిమాల్లోకి ఎప్పుడు తీసుకొస్తున్నారనే ప్రశ్న ఎదురైంది. ఈ క్రమంలోనే కృష్ణవంశీ.. తన కొడుకు రిత్విక్ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తన కొడుకు.. లండన్‌లో బిజినెస్ స్కూల్లో.. మేనేజ్‌మెంట్ చదువుతున్నాడని చెప్పిన కృష్ణ వంశీ.. ప్రస్తుతానికి అతనికి సినిమాలపై అంతగా ఆసక్తి లేదన్నారు. అయితే భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేమని కూడా కృష్ణవంశీ తన మాటల్లో కోట్ చేశారు. అంతేకాదు.. తన కుమారుడు చాలా మెచ్యూర్డ్‌గా మాట్లాడతాడని, తనకంటే రమ్య తెలివితేటలు ఎక్కువ వచ్చాయేమో అంటూ సరదాగా కామెంట్ చేశారు. తన కొడుకు.. తనని.. రమ్యకృష్ణని.. బాగా అర్థం చేసుకుంటాడని కూడా అన్నారు. తమతో చక్కగా ప్రవర్తిస్తాడని చెబుతూనే.. తన కొడుకు తీరుపై.. కృష్ణ వంశీ సంతోషం వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Top9 ET: అల్లు శిరీష్ పెళ్లి వేడుక.. మెగా బ్రదర్స్ కి స్పెషల్ పెళ్లి పిలుపు..

మెట్రో పిల్లర్‌పై చిక్కుకున్న పిల్లి.. ఎలా కాపాడారంటే..

గ్రామ సర్పంచ్‌ ఇంటిముందు క్షుద్రపూజలు

స్మశానంలో దెయ్యలతో కలసి మనుషులు మందు పార్టీ.. ట్రెండ్ అవుతున్న వీడియో

వేల కిలోమీటర్లు ఎగురుకుంటూ వచ్చిన అతిథులు..

Follow Us