Sudeep: డైరెక్షన్ కోసం కిచ్చా సుదీప్‌ వర్కవుట్‌ చేసుకుంటున్నారా?

Edited By:

Updated on: May 29, 2026 | 5:30 PM

‘మ్యాక్స్’ సినిమా తర్వాత కొత్త ప్రాజెక్ట్ ప్రకటించకపోవడంతో కిచ్చా సుదీప్ భవిష్యత్ ప్రణాళికలపై చర్చ మొదలైంది. ఇది సాధారణ విరామం కాదని, కొత్త కథల కోసం తీసుకున్న ప్రిపరేషన్ టైమ్ అని సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు సుదీప్ మళ్లీ దర్శకుడిగా మారే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు కూడా శాండిల్‌వుడ్‌లో ఆసక్తిని పెంచుతున్నాయి.

సినిమా సినిమాకీ గ్యాప్‌ ఇవ్వడం కొంతమంది హీరోలకు చాలా కామన్‌ అయిపోయింది. సుదీప్‌ కూడా అలాంటి గ్యాపే తీసుకున్నారా? అనే టాక్‌ నడుస్తోంది కన్నడ ఇండస్ట్రీలో. అయితే సుదీప్‌ తీసుకున్నది గ్యాప్‌ కాదని, నెక్స్ట్ చేయబోయే సినిమాలకోసం ప్రిపరేషన్‌ టైమ్‌ అని చెబుతున్నారు దగ్గరివారు. ఇంతకీ సుదీప్‌ చేసింది నిజంగా ప్రిపరేషనేనా? గతేడాది డిసెంబర్‌లో రిలీజ్‌ అయింది మార్క్ మూవీ. అప్పటి నుంచి మరే ప్రాజెక్టుకీ సైన్‌ చేయలేదు సుదీప్‌. ఒకరికి నలుగురు డైరక్టర్ల దగ్గర కథలు విన్నారని, ఆ ప్రాజెక్టులు పట్టాలెక్కే సూచనలు ఎక్కువగా ఉన్నాయనీ అంటోంది కన్నడ ఇండస్ట్రీ. త్వరలోనే సుదీప్‌ డైరక్టర్‌ కుర్చీలో కూర్చోబోతున్నారన్నది మరో న్యూస్‌. తెలుగులో సూపర్‌ సక్సెస్‌ అయిన మిర్చి సినిమాను 2014లో ‘మాణిక్య’ పేరుతో డైరక్ట్ చేశారు సుదీప్‌. ఆ సినిమా అప్పుడు సూపర్‌ సక్సెస్‌ అయింది. ఇన్నేళ్ల తర్వాత మరోసారి కెప్టెన్‌ కుర్చీ మీద ఆశలు పెంచుకుంటున్నారట సుదీప్‌. అయితే ఈ సారి రీమేక్‌ తో వెళ్తారా? లేకుంటే ఒరిజినల్‌ స్టోరీని డైరక్ట్ చేస్తారా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఆ మధ్య సుదీప్‌ని ఉద్దేశించి లోకేష్‌ పెట్టిన పోస్టును కూడా గుర్తుచేసుకుంటున్నారు జనాలు. లోకేష్‌ సినిమాటిక్‌ యూనివర్శ్‌లో సుదీప్‌ జాయిన్‌ అవుతారా? సుదీప్‌ కెప్టెన్సీలో లోకేష్‌ ఏమైనా సినిమా చేస్తారా? లేకుంటే, వీరిద్దరూ కలిసి మరేదైనా ప్లాన్‌ చేస్తున్నారా అనే చర్చ ఇప్పుడు మళ్లీ ఫ్రెష్‌గా కనిపిస్తోంది. యాక్టింగా? డైరక్షనా? అనే విషయం మీద సుదీప్‌ అతి త్వరలోనే క్లారిటీ ఇస్తారన్నది మాత్రం గ్యారంటీ అంటోంది శాండిల్‌వుడ్‌.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Aadhaar App: ఆధార్‌ పై కీలక నిర్ణయం.. పాత ‘ఎమ్‌ఆధార్’ యాప్ బంద్

TTD: శ్రీవారి భక్తులకు భారీ ఊరట ఇక.. క్యూలైన్‌లో ఉండే పని లేదు

షాక్‌లో సినీ డైరెక్టర్లు! 66 హార్డ్ డిస్క్‌లు మాయం

Peddi: పెద్ది దుబాయ్ సెన్సార్ టాక్ మామూలు కాదు.. చరణ్ కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ అంటారా

అంతరిక్షంలో మనిషి పుట్టుకకు తొలి అడుగు.. చైనా సంచలన ప్రయోగం వెనక అసలు కథ

Follow Us