Narne Nithiin: NTR బామ్మర్ది కూడా పిఠాపురం తాలూకానే.!

Updated on: Aug 06, 2024 | 8:58 AM

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుణ్యమా అని పిఠాపురం నియోజకవర్గం పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ ఇక్కడి నుంచే పోటీ చేయడం, రికార్డు మెజారిటీతో విజయం సాధించడంతో పిఠాపురం పేరు తరచూ వార్తల్లో వినిపిస్తోంది. ఇక సినిమా వాళ్లు కూడా పిఠాపురం వైపే చూస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఏ సినిమా ఈవెంట్ జరగకపోయినా ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు పిఠాపురంలో వెళ్లి సందడి చేస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుణ్యమా అని పిఠాపురం నియోజకవర్గం పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ ఇక్కడి నుంచే పోటీ చేయడం, రికార్డు మెజారిటీతో విజయం సాధించడంతో పిఠాపురం పేరు తరచూ వార్తల్లో వినిపిస్తోంది. ఇక సినిమా వాళ్లు కూడా పిఠాపురం వైపే చూస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఏ సినిమా ఈవెంట్ జరగకపోయినా ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు పిఠాపురంలో వెళ్లి సందడి చేస్తున్నారు. ఆగస్టు 03న మెగా డాటర్ నిహారిక కొణిదెల కూడా తన కమిటీ కుర్రాళ్లు టీంతో పిఠాపురంకి వెళ్లి కుక్కుటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలయ్యాయి. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ కూడా మెగా డాటర్ నిహారిక దారిలోనే పిఠాపురం వెళ్లారు.

ఇక అసలు విషయం ఏంటంటే.. ఎన్టీఆర్ బామ్మర్ది, మ్యాడ్ సినిమా హీరో నార్నె నితిన్ ఎట్ ప్రజెంట్ ‘ఆయ్’ సినిమా చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే షూటింగ్ అంతా పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 15న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈక్రమంలోనే ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను తాజాగా పిఠాపురంలో గ్రాండ్‌గా నిర్వహించారు మేకర్స్.

ఇక ఈ ఈవెంట్ కి నార్నె నితిన్ తో పాటు హీరోయిన్ నయన్ సారిక, మూవీ టీమ్ అంతా హాజరయ్యారు. దాంతో పాటే పిఠాపురంలో మొదటిసారి అధికారికంగా సినిమా ఈవెంట్ నిర్వహించిన ఘనతను దక్కించుకున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Loading...
Unable to load recommendations.
Follow Us