దసరాకు మొదలుపెట్టారు.. దివాళి వరకు ఆపరేమో..?
దసరాకు విడుదలైన ‘జైలర్ 2’, ‘రణబాలి’ సినిమాలకు మరో వారాంతం కలిసిరానుందా? ఈ వారం పెద్ద సినిమాల విడుదలలు తక్కువగా ఉండటంతో థియేటర్లలో ఈ చిత్రాల హవా కొనసాగవచ్చనే అంచనాలు ఉన్నాయి. ‘జైలర్ 2’ రూ.600 కోట్ల మార్క్‌కు చేరువవుతోందని, ‘రణబాలి’ రూ.75 కోట్ల మైలురాయిని అందుకోనుందని కథనం చెబుతోంది. ప్రేక్షకుల స్పందనకు ధన్యవాదాలు తెలిపేందుకు అక్టోబర్ 23న అనంతపురంలో ‘రణబాలి’ టీమ్ థ్యాంక్స్ మీట్ నిర్వహించనుంది.
దసరాకు రిలీజ్ అయిన సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర మరో వారం పాటు సాలిడ్ అడ్వాంటేజ్ దొరికేసినట్లేనా..? ఫుల్ కలెక్షన్స్‌తో దూసుకుపోతున్న రజినీకాంత్ జైలర్ 2, విజయ్ దేవరకొండ రణబాలి సినిమాలకు ఇప్పట్లో బ్రేకులు పడే ఛాన్స్ లేనట్లేనా..? ఈ వారం కూడా థియేటర్లలో చెప్పుకోదగ్గ పెద్ద రిలీజ్‌లు ఏమీ లేకపోవడంతో ఈ వీకెండ్ కూడా బాక్సాఫీస్ దగ్గర దసరా సినిమాల డామినేషన్ కంటిన్యూ కాబోతోందా..? దసరా బరిలో దిగిన జైలర్ 2, రణబాలి సినిమాలు రెండో వారంలోకి ఎంటరైనా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. జైలర్ 2 సినిమా ఏకంగా 600 కోట్ల మార్క్‌కు చేరువ అవుతుండగా, రణబాలి కూడా 75 కోట్ల మైల్ స్టోన్ టచ్ చేయబోతోంది. ఈ వసూళ్ళతో బాక్సాఫీస్ దగ్గర ఈ రెండు సినిమాలు సెకండ్ వీక్‌లో కూడా తమ సాలిడ్ స్టామినాను ప్రూవ్ చేసుకుంటున్నాయి. రణబాలి సినిమాకు ఆడియన్స్ నుంచి వస్తున్న ఈ అదిరిపోయే రెస్పాన్స్‌కు ఫిదా అయిన మేకర్స్.. అక్టోబర్ 23వ తేదీన అనంతపురంలో గ్రాండ్‌గా థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేయబోతున్నారు. ఇక ఈ వారం బాక్సాఫీస్ రేసును చూసుకుంటే.. దసరా సినిమాలకు పోటీనిచ్చే రిలీజ్‌లు లేవు. దాంతో రణబాలి, జైలర్ 2లకు మరో వారం పాటు కలెక్షన్స్ రాబట్టుకునే ఒక సూపర్ అడ్వాంటేజ్ దొరికినట్లు అయింది. ఈ వారం మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన 418 సినిమా రిలీజ్ కానుండగా.. కోర్ట్ హీరోయిన్ శ్రీదేవి నటించిన హైకు అనే చిన్న సినిమా కూడా థియేటర్లలోకి వస్తోంది. ఈ రెండు మినహా ఆప్షన్స్ లేకపోవడంతో.. పండుగ సినిమాల థియేటర్స్ కౌంట్ ఎక్కడా తగ్గే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. మొత్తానికి ఎలాంటి అడ్డంకుల్లేకుండా ఈ వీకెండ్ బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా దసరా సినిమాల హవానే కొనసాగబోతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రూపాయి కాయిన్స్‌తో మహిళ నామినేషన్.. ఊరంతా తలో రూపాయి చందా
హెయిర్ పిన్ కోసం దిండుకింద చేయి పెట్టిన యువతి.. చేతికి తగిలింది చూసి షాక్!
ఇంటిముందు బెంచ్‌పై కూర్చున్న వ్యక్తులు క్షణాల్లో ఊహించని సీన్