ఏంటీ ? వీళ్ల మధ్య ఉన్నది భార్య భర్తల బంధం కాదా?
జాకీ భగ్నాని సిచువేషన్షిప్ వ్యాఖ్య సోషల్ మీడియాలో రచ్చ రేపింది. తమ వైవాహిక బంధంపై అసత్య వార్తలు వస్తున్నాయని రకుల్ ప్రీత్ సింగ్ తీవ్రంగా ఖండించారు. పెళ్లైనప్పటికీ, తమ బంధం ఎప్పుడూ కొత్తగా ఉంటుందని జాకీ వివరించినట్లు రకుల్ పేర్కొన్నారు. ఒకరి జీవితంలోని లోటును భర్తీ చేసుకోవడానికి కాకుండా, సంతోషాన్ని పంచుకోవడానికే వివాహం చేసుకున్నామని స్పష్టం చేశారు.
నటి రకుల్ ప్రీత్ సింగ్ భర్త, నిర్మాత జాకీ భగ్నాని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వాడిన సిచువేషన్షిప్ అన్న పదం సోషల్ మీడియాలో పెద్ద వివాదాన్ని రేపింది. ఈ జంట 2024 ఫిబ్రవరిలో వివాహం చేసుకున్నారు. జాకీ తన బంధం గురించి మాట్లాడుతూ, పెళ్లైనా తాము ఇప్పటికీ సిచువేషన్షిప్లో ఉన్నట్లే భావిస్తామని పేర్కొన్నారు. సాధారణంగా బాధ్యత లేని బంధంగా భావించే ఈ పదంపై నెటిజన్లు రకరకాలుగా విశ్లేషించారు. అయితే జాకీ ఉద్దేశం వేరని, పెళ్లి తర్వాత వచ్చే బాధ్యతలు బంధాన్ని బోర్ కొట్టకుండా, ఎప్పుడూ ఒక కొత్త డేటింగ్ వెబ్‌ను మెయింటైన్ చేస్తున్నామని చెప్పడమేనని స్పష్టమైంది. ఈ వ్యాఖ్యను తప్పుగా అర్థం చేసుకోవడంతో, రకుల్ ప్రీత్ సింగ్ తన వైవాహిక బంధంపై వస్తున్న అసత్య వార్తలను తీవ్రంగా ఖండించారు. ఒక గంట సంభాషణలో ఒకే ఒక్క లైన్‌ను తీసుకొని క్లిక్ బైట్స్ కోసం ఇలాంటి హెడ్ లైన్స్ పెట్టడం బాధ్యతారాహిత్యం అని ఆమె పేర్కొన్నారు. తమ బంధం పరిపక్వతతో కూడుకున్నదని, సంతోషాన్ని పంచుకోవడానికే వివాహం చేసుకున్నామని రకుల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో వివరించారు.
